రాష్ట్రంలో  భార‌తీ పే పోస్ట‌ర్ల క‌ల‌క‌లం!

నిర‌స‌న‌, వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌డానికి రాజ‌కీయ‌పార్టీలు, నాయ‌కులు అనేక మార్గాలు వెతుకుతున్నారు. ఇపుడు కొత్త‌గా పోర్ట‌ర్లువేసి మ‌రీ చెబుతున్నారు. ట్వ‌ట్ట‌ర్లు, మీడియా స‌మావేశాల్లో తిట్ట‌డం  కంటే ఇద యితే రాష్ట్ర‌మంతా తెలు స్తుంద‌న్న కొత్త ఆలోచ‌న‌ను అనుస‌రిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఈ త‌ర‌హా తీవ్ర వ్య‌తిరేక‌త‌ను  ప్ర‌ద ర్శించ‌డం ఇదే మొద‌టిసారి. 

ఇది మ‌రింత పెర‌గ‌డానికి కార‌ణం గ‌తంలో చంద్ర బాబునాయుడు వియ్ డోంట్ వాంట్ ఎన్టీఆర్  అని అన్నారంటూ అప్ప‌టి ఆంగ్ల ప‌త్రిక క‌టింగ్‌తో  వైసీపీ  పోస్ట‌ర్లు వేసింది.  ఇపు డు  టీడీపీవారికి అలాంటి ప్ర‌చారంతో వైసీపీ, జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రువును బ‌జారున పెట్టడానికి అవ‌కాశం ల‌భించింది. అందుకే పోటీగా టీడీపీ నేత‌లు భార‌తీ పే అనే పోస్ట‌ర్లు అంటిస్తున్నా రు. క‌ర్ణాట‌కాలో కాంగ్రెస్ పే టీఎంకు పేర‌డీగా పే సీఎం పోస్ట‌ర్లు వెలిసాయి.  అదే విధంగా  టీడీపీ నేతలు భారతీపే అనే పోస్టర్లు అంటిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పేటీఎంకు పేర డీగా పేసీఎం పోస్టర్లు తెచ్చి నలభై శాతం కమిషన్లు యాక్సెప్ట్ చేస్తార న్నట్లుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. 

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో నిందితుడిగా చిక్కిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అల్లుడు వాస్త‌వానికి స్కాం సొమ్మంతా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు సంబంధించిన  ఒక సంస్థ‌లో పెట్టార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. దీని మీద టిడీపీ నాయ కులు విరుచుకుప‌డ్డారు. ముఖ్యమంత్రికి తెలియ‌కుండానే ఇదంతా జ‌రుగుతోందా అని టీడీపీ నాయ‌ కులు నిల‌దీశారు. కానీ ప్రభుత్వంనుంచి ఎలాంటి అలికిడీ లేక‌పోవ‌డ‌మే ఆ అనుమానాన్ని బ‌ల‌ ప‌రి చింది.  పైగా ఆ సొమ్మును జ‌గ‌న్ భార్య భార‌తి చెల్లించాల‌ని డిమాండ్ చేయ‌డ‌మేనా  మ‌రి ఈ  భార‌తీ పే పోస్ట‌ర్ల ల‌క్ష్యం! 

రాజ‌కీయాల్లో ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు సంధించుకోవ‌డం ప‌రిపాటి. కానీ లిక్క‌ర్ స్కామ్‌లో బ‌య‌ట‌ప‌డిన పేర్ల‌లో జ‌గ‌న్ భార్య భార‌తి పేరు ప్ర‌స్తావ‌న‌కు రావ‌డంతో ఈ త‌ర‌హా పోస్ట‌ర్ల‌కు ఊత‌మిచ్చింద‌నాలి. ఒక పార్టీ మీద బుర‌ద జ‌ల్లేట‌పుడు త‌మ పార్టీ ప‌రిస్థితిని ప‌రిశీలించక‌పోవ‌డం వైసిపీ చేసిన త‌ప్పు. త‌మ పార్టీ వ్య‌వ హారాల‌న్నీ ఎంతో చ‌క్క‌గా, ఎలాంటి అవినీతికి పాల్ప‌డనివారితో సాగిపోతోంద‌ని భావించి ఇత‌ర పార్టీల మీద దుమ్ము జ‌ల్ల‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌డం అర్ధ‌ర‌హితం. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu