సచివాలయం పరిసరాల్లో పిచ్చి కుక్కల వీరంగం
posted on Oct 11, 2025 8:51PM

తెలంగాణ సచివాలయం పరిసర ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు వీరంగం సృష్టిస్తు న్నాయి. గత కొన్ని రోజులుగా సచివాలయం ప్రాంతంలో స్వైర విహారం చేస్తున్న స్ట్రే డాగ్స్ ఇప్పటికే ముగ్గురిని కరిచి గాయపరిచాయి. తాజాగా ఈరోజు మరో మహిళపై కూడా పిచ్చి కుక్క దాడి చేసింది. డైలీ పాస్ కౌంటర్, క్యాంటీన్, మీడియా సెంటర్ పరిసరాల్లో ఈ కుక్కలు కాపు కాస్తూ.... పాదాచా రులు, సచివాలయ సిబ్బంది, వాహనదా రులపై దాడులు చేస్తూ నానా హంగామా సృష్టిస్తు న్నాయి.
నిన్న ముగ్గురు సందర్శకులు గాయపడగా, ఈరోజు మరొకరు కుక్క దాడికి గుర య్యారు. దీంతో సెక్రటేరియట్ సిబ్బంది, సందర్శకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల బెడదతో పాదాచారులు రోడ్లపై నడవటానికే భయపడుతున్నారుసచివాలయం సమీపంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్ కార్యాలయం దగ్గరే ఈ సంఘటనలు చోటుచేసుకోవడం విశేషం.
.అయిన ప్పటికీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు, బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సెక్రటేరియట్ సిబ్బంది రేబిస్ ఇంజెక్షన్లు సెక్రటేరి యట్ డిస్పెన్సరీలో అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. గతంలో వీధి కుక్కలు ఒంటరిగా ఉన్న చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘట నలు ఎన్నో జరిగాయి... పలు ప్రాంతాల్లో పాదా చారులపై దాడులు చేసిన ఘటనలు కూడా జరిగాయి.. అయినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తు న్నారంటూ ప్రజలు, సచివాలయం సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.