సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారికి సీపీ సజ్జనార్ కీలక సూచనలు

 

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగకు  స్వస్థలాలకు వెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషన్ లేదా బీట్ ఆఫీసర్ కు తెలియజేయాలని సీపీ సుచించారు. ప్రయాణ సమయంలో నగదు, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని వాటిని బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రదేశాల్లో భద్రపరలని సజ్జనార్ తెలిపారు. దొంగతనాల నివారణ కోసం, నేరాల నియంత్రణ కోసం పోలీసులకు సహకరించండని సీపీ కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయలని సూచించారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu