సాక్షీ మహరాజ్... సంజయ్ రావత్... సుబ్రమణ్యస్వామి
posted on Oct 24, 2015 8:04PM

సాక్షీ మహరాజ్... సంజయ్ రావత్... సుబ్రమణ్యస్వామి
బీజేపీ ఎంపీల్లో సాక్షీ మహరాజ్ స్టైలే వేరు... ప్రధాని మోడీ అధికారంలో వచ్చాక ఆయన చేసినంత రచ్చ మరెవరూ చేయలేదేమో, సందర్భం ఏదైనా ప్రతిసారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాక్షీ మహరాజ్... ముఖ్యంగా ముస్లింలపై కామెంట్స్ మాత్రం తీవ్ర దుమార్నే రేపాయి... అలాగే శివసేన ఎంపీ సంజయ్ రావత్, కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు మీకోసం
(బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్)
- దేశంలో పిల్లలను కనడంపై ఆంక్షలు విధించాలి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారికే ఓటు హక్కు కల్పించాలి, హిందువులు కుటుంబ నియంత్రణ పాటించినప్పుడు, ముస్లింలు ఎందుకు పాటించరు
( బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ )
గోవులను చంపేవారిని హత్య చేసినా తప్పులేదు
( బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ )
- నాథురామ్ గాడ్సే గొప్ప దేశభక్తుడు
(శివసేన ఎంపీ సంజయ్ రావత్)
- ముస్లింలకు ఓటు హక్కును తొలగించాలి
(కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు)
- అగ్గిపెట్టె, సిగరెట్లను తీసుకొని ఎన్నోసార్లు విమానంలో ప్రయాణించా... ఎవరూ చెక్ చేయలేదు
(బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి)
- లంకాధీశుడు రావణుడు, ఆయన భార్య మండోదరి ఉత్తరప్రదేశ్‌కు చెందిన దళితులే