వరంగల్ ఉపఎన్నికలలో ఉమ్మడి అభ్యర్దికే తెదేపా, బీజేపీలు మొగ్గు
posted on Oct 24, 2015 9:09PM
.jpg)
తెలంగాణా తెదేపా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, కిషన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యి రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలని నిర్ణయించుకొన్నారు. తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా వరంగల్ ఉపఎన్నికలలో పోటీ చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నందున మళ్ళీ రేపు ఇరు పార్టీల నేతలు మరొకమారు సమావేశమయ్యి తమ ఉమ్మడి అభ్యర్ధి పేరును ఖరారు చేస్తారు. బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వడానికి తెదేపా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.
కాంగ్రెస్, తెరాస పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ఇంకా ఖరారు చేయలేదు. స్వతంత్ర అభ్యర్ధి గాలి వినోద్ కుమార్ కి వామపక్షాలు మద్దు ప్రకటించాయి. ఈ ఉపఎన్నికలలో వైకాపా కూడా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. బహుశః తెదేపా-బీజేపీలకు పడే ఓట్లను చీల్చి తెరాసకు పరోక్షంగా సహాయపడేందుకే ఎన్నికల బరిలో దిగుతోందేమో లేకపోతే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దగ్గరవుతున్నందున, తెరాసను శత్రువుగానే పరిగణిస్తామని సూచించేందుకే పోటీ చేస్తుండవచ్చును.