జియో నుండి దిమ్మ తిరిగే ఆఫర్...

 

ఇప్పటికే ఉచిత ఆఫర్లతో భారత టెలికాం  సెక్టార్ కు చుక్కలు చూపించిన జియో ఇప్పుడు తాజాగా మరో బంపరాఫర్ తో ముందుకొచ్చింది. జియో ఉచిత సేవల వల్ల తమ రాబడులు బాగా తగ్గిపోయాయని ఇతర టెలికాం సంస్థలు ఏడుస్తున్నా.. జియో మాత్రం ఎక్కడా తగ్గకుండా తన ఆఫర్ల జోరు మాత్రం పెంచుకుంటూ పోతూనే  ఉంది. అయితే సమ్మర్ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ తో వినియోగ దారులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని చూసిన జియోకు మాత్రం ట్రాయ్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. జియో ప్రైమ్ మెంబర్ షిప్ గడువు 15 రోజుల పొడిగింపుతో పాటు రూ.303 ప్యాక్ తో రీఛార్జ్ చేసుకున్న వారికి మూడు నెలలు ఉచిత సేవలను అందించనున్నట్టు పేర్కొంటూ జియో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ను తీసుకురాగా.. ఆ ఆపర్ ను వెంటనే విత్ డ్రా చేసుకోమని జియోను ట్రాయ్ ఆదేశించింది. దీంతో జియో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ రద్దు చేసింది. అయితే ఆ ప్రభావం యూజర్లపై పడకుండా ఉండేందకు గాను జియో అద్భుతమైన ఆఫర్ ను తీసుకొచ్చింది. అదే ‘ధన్‌ ధనా ధన్‌’ అఫర్. అసలు ఈ ఆఫర్ ఎంటి.. ఈ ఆఫర్ వల్ల వల్ల లాభమేంటో ఓ లుక్కేద్దాం.

 

ఈ ‘ధన్‌ ధనా ధన్‌’ ఆఫర్ లో రూ.309 రీచార్జ్‌తో 84 రోజులకు 84 జీబీ డేటా వస్తుంది. అంటే రోజుకు 1 జీబీ డేటా లిమిట్‌.. నెలకు 28 రోజుల చొప్పున 3 నెలలు అన్నమాట. ఇందులో దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ కూడా ఉంటుంది. ఇక  రూ.509 రీచార్జ్‌తో 84 రోజులకు 168 జీబీ డేటాను పొందొచ్చు. అంటే రోజుకు 2 జీబీ డేటా అన్నమాట. ఈ రెండు ప్లాన్లు జియో ప్రైమ్‌ మెంబర్లకు మాత్రమే పరిమితం. మరి నాన్‌ ప్రైమ్‌ యూజర్లయితే రోజుకు 1 జీబీ డేటా చొప్పున 84 రోజులకు రూ. 408 పడుతుంది. 2 జీబీ కావాలంటే వాళ్లు రూ. 608 చెల్లించాలి. మరి ఈ ‘ధన్‌ ధనా ధన్‌’ ఆఫర్ టెలికాం సంస్థలకు దడ పుట్టిస్తున్న జియో ముందు ముందు ఇంకెన్ని ఆపర్లు తీసుకొస్తుందో చూద్దాం..!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu