సీఎం తల నరికిన వారికి రూ. 11లక్షల బహుమతి..
posted on Apr 12, 2017 11:14AM

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేత యోగేష్ వార్ష్నే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ జయంతి సందర్బంగా బిర్భమ్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యోగేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఇక్కడ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు ముందుగానే హెచ్చరించినప్పటికీ.. నిర్వాహకులు వినిపించుకోలేదు. దీంతో ర్యాలీ చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనికిగాను ఆగ్రహించిన యోగేష్... మమత మద్దతు ముస్లింలకేనని..ఇఫ్తార్ పార్టీలను మాత్రం మమత నిర్వహిస్తారని.. ‘సీఎం తల నరికి తీసుకొచ్చిన వారికి రూ. 11లక్షల బహుమతి ఇస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.