రిలయన్స్ ధన్‌​ ధనాధన్ ఆఫర్...


రిలయన్స్ జియో మరో అదిరిపోయే ఆఫర్ తో ముందుకొచ్చింది. ట్రాయ్ ఆదేశాలతో సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ను రద్దు చేసింది. అయితే ఇప్పుడు ధన్‌​ ధనాధన్ బంపరాఫర్ తో ముందుకొచ్చింది. జియో తెచ్చిన ఆఫర్లు ఒకసారి చూద్దాం...

 

* రూ. 309తో రీచార్జి చేసుకుంటే రోజుకు 1 జీబీ డేటా లిమిట్‌తో 84 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. 84 రోజులు అంటే నెలకు 28 రోజుల చొప్పున 3 నెలలు అన్నమాట. ఇందులో దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ కూడా ఉంటుంది.
* రోజుకు 2 జీబీ డేటా కావాలనుకుంటే అదే 84 రోజులకు రూ. 509తో రీచార్జి చేసుకోవాలి. ఈ రెండు ప్లాన్లు జియో ప్రైమ్‌ మెంబర్లకు మాత్రమే పరిమితం.
* నాన్‌ ప్రైమ్‌ యూజర్లయితే రోజుకు 1 జీబీ డేటా చొప్పున 84 రోజులకు రూ. 408 పడుతుంది. 2 జీబీ కావాలంటే వాళ్లు రూ. 608 చెల్లించాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu