శశికళ ములాఖత్ కు ముక్కుతాడు...


అక్రమాస్తుల కేసులో భాగంగా శశికళ బెంగుళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. శశికళతోపాటు ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లు అదే జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే సాధారణంగా అక్కడి జైలు నిబంధనల ప్రకారం.. ములాఖత్‌ పేరున ఒక ఖైదీ తన న్యాయవాది, బంధువులు, స్నేహితులతో 15 రోజులకు ఒకసారి, కేవలం 15 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. అయితే ఈ నిబంధనలు శశికళ అతిక్రమించినట్టు తెలుస్తోంది. ఆమె జైలుకు వెళ్లిన దగ్గర నుండి చాలా మందితో సంభాషించారని.. అది కూడా 15 నిమిషాలకు కాకుండా 40 నిమిషాలపాటూ మాట్లాడారని...దానికి తోడు ములాఖత్‌ కోసం జైలు ఆవరణలోని ప్రత్యేక గదిని ఆమె వినియోగించుకున్నారు. దీంతో దీనిపై జైలు అధికారులు స్పందించి ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ములాఖత్‌ కింద ఇప్పటికే లెక్కకు మించి సందర్శకులు వచ్చారని.. ఇకపై అలా కుదరదని..సాధారణ సందర్శకులే కాదు మంత్రులను సైతం అనుమతించేది లేదని గట్టిగానే ఆంక్షాలు విధించారు.  ప్రత్యేక అనుమతి పొంది వచ్చినా అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu