సిద్ధూకి మరో ఎదురుదెబ్బ..


భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఒకదాని తరువాత ఒకటి వరుసగా చిక్కులు ఎదురవుతున్నాయి. మొన్నటి వరకూ మంత్రిగా ఉంటూ టీవీ షోల్లో పాల్గొనడం ఏంటని పలువురు విమర్శలు చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులైతే దీనిని ఖండించారు. అయినప్పటికీ ఆయన టీవీ షోలో పాల్గొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఆయనపై మరో న్యాయవాది కోర్టులో కేసు వేశారు.  ది కపిల్ శర్మ షోలో ద్వంద్వార్థాలు వచ్చేలా సిద్ధూ అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తున్నారంటూ.. కుటుంబ సభ్యులతో కలసి షో చూడాలంటేనే ఇబ్బందిగా ఉందని చెప్పారు. దీంతో దీనిపై స్పందించిన కోర్టు.. బాధ్యత గల మంత్రిగా సర్వీస్ రూల్స్ పాటించకపోతే ఎలాగంటూ ప్రశ్నించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu