నేను మారిపోయాను.. మా అమ్మ మీద ఒట్టు..
posted on Apr 12, 2017 10:47AM
.jpg)
సాధారణంగా వర్మ మాట మీద నిలబడటం చాలా తక్కువ అని తెలిసిందే. ఇకపై ఎవరిమీద కామెంట్లు చేయను.. ట్వీట్లు చేయను అని చెప్పే వర్మ ఆ తరువాత ఏదో ఒక రకంగా మళ్లీ ట్వీట్లు చేస్తూనే ఉంటారు. గతంలో కూడా మెగా ఫ్యామిలీ పై ట్వీట్లు చేయనూ అంటూ ప్రకటించి, తిరిగి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు వర్మ. ఇప్పుడు మరోసారి అలాంటి ట్వీట్ చేసి అందరిని షాక్ కు గురిచేశాడు. అసలు సంగతేంటంటే.. ఇటీవల వర్మ విద్యుత్ జమాల్, టైగర్ ష్రాఫ్ ల మార్షల్ ఆర్ట్స్ ను పోలుస్తూ ట్వీట్స్ చేశాడు. అయితే దానికి స్పందించిన విద్యుత్ జమాల్, షావోలిన్ మాంక్ స్టైల్ ను మర్చిపోయి, రామ్ గోపాల్ వర్మ డ్రంకెన్ మాస్టర్ స్టైల్ ను ట్రై చేయండి అంటూ కౌంటర్ ఇచ్చాడు.
ఇక దీనికి గాను వర్మ 'నేను మారిపోయాను ఇక ఎవరి మీద వివాదాస్పద ట్వీట్లు చేయను, నన్ను నమ్మండి. నా వల్ల ఇబ్బంది పడ్డవాళ్లంతా నన్ను క్షమించండి' అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు అక్కడితో ఆగకుండా 'నేను దేవుణ్ని నమ్మను కాబట్టి నా మాటలు మీరు నమ్మకపోవచ్చు అందుకే ఈసారి మా అమ్మ మీద, దర్శకుడు స్పీల్ బర్గ్ మీద బాలీవుడ్ మెగాస్టార్ సీనియర్ బచ్చన్ మీద ఒట్టేసి చెపుతున్నా' అంటూ ట్వీట్ చేశాడు. అయితే వర్మ సంగతి తెలిసిన వారు ఈ ట్వీట్లను అంత సీరియస్ గా తీసుకోవటం లేదు. చూద్దాం మరి ఈసారైనా ఎంత వరకూ మాట మీద నిలబడతాడో.