ఏవోబీలో ఎదురుకాల్పులు.. మావోయిస్టు హతం...

 

ఏవోబీ (ఆంధ్రా-ఒడిశా సరిహద్దు) లో కాల్పులు చోటుచేసుకున్నాయి.  కోరాపూట్‌ జిల్లా నారాయణపట్నం సమీపంలోని లల్లేరి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా.. ఒక గిరిజనుడికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. అతనిని ఆస్పత్రికి తరలించారు. కాల్పుల అనంతరం చాలామంది మావోయిస్టులు అక్కడి నుంచి పరారైనట్లు భద్రతా సిబ్బంది తెలిపారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu