రాజ్యసభలో ప్రత్యేక హోదాపై రచ్చ...
posted on Apr 11, 2017 4:49PM

రాజ్యసభలో మరోసారి ఏపీ ప్రత్యేక హోదాపై రచ్చ మొదలైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి చెప్పకనే చెప్పింది. రాజ్యసభలో మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ మాట్లాడుతూ.. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా...ఏపీని స్పెషల్ కేటగిరీ స్టేట్ అంటున్నామని తెలిపారు. ఉత్తరాఖండ్ తరువాత మరే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని...నీతి ఆయోగ్ అమల్లోకి రాకముందు దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఉందని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదా రావాలంటే ఎన్డీసీ అనుమతి తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేకహోదాను ఎన్డీసీ ఆమోదించలేదని ఆయన తెలిపారు. దీంతో ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై పలువురి స్పందనలు..
కేవీపీ..
ప్రత్యేక హోదా ఇవ్వద్దని ప్రణాళిక సంఘం చెప్పలేదు.. దీనిపై చర్చించేందుకు జాతీయ అభివృద్ధి మండలి సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు.
విజయసాయిరెడ్డి..
మంత్రి ఇచ్చిన ప్రకటన దారి తప్పేదిగా ఉంది..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వద్దని ప్రణాళిక సంఘం చెప్పలేదు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని సభ సాక్షిగా ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
సుబ్బిరామి రెడ్డి
ఏపీలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు కారణంగా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని నాటి ప్రధాని ప్రకటించారు..ఏపీ హైదరాబాద్ ను కోల్పోయింది. ఆదాయాన్ని భారీగా నష్టపోయింది.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారు.
దిగ్విజయ్ సింగ్
జాతీయ అయోధ్య మండలిని నీతి అయోగ్ గా మార్చారు. నీతి అయోగ్ లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా..లేదా..? అని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ఐదేళ్లు కాదు.. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అడిగిన వెంకయ్యకు ఆనాడు చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు.