భారత్ కు ఈ మరణశిక్ష ఓ హెచ్చరిక..

 

భారత్ రా ఏజెంట్ కుల్‌భూషణ్‌ జాధవ్‌ కు పాకిస్థాన్ ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన భారత్ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తోంది. అయితే పాకిస్థాన్ మాత్రం తమ చర్యను సమర్ధించుకుంటుంది. పాకిస్థాన్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ... తమ దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేసిన వారికి ఈ మ‌ర‌ణ‌శిక్ష‌ హెచ్చరిక లాంటిందని, పాక్‌ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారిని వదిలిపెట్టబోమని ఆయ‌న హెచ్చ‌రించారు. త‌మ దేశ ప్ర‌జ‌లు, సైనికులు పాక్‌ కోసం ఎన్నో త్యాగాలు చేశారని... వారు చేసిన త్యాగాలు ఉగ్రవాదులతో పాటు వారికి సాయం చేసేవారికి తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నాయని అన్నారు. అంతేగాక‌, మ‌ర‌ణ‌శిక్ష ప‌డ్డ‌ కుల్ ‌భూష‌ణ్ తాను చేసిన నేరాన్ని బహిరంగంగా ఒప్పుకొన్నాడని ఆయ‌న అన్నారు.

 

కాగా గ‌తేడాది మార్చిలో ఇరాన్ నుంచి బ‌లూచిస్థాన్‌లోకి ప్ర‌వేశించాడ‌ని భారత్ రా ఏజెంట్ కుల్‌భూష‌ణ్‌ జాద‌వ్‌ అరెస్ట్ చేశారు. గూఢ‌చర్యం చేస్తున్నాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో పాకిస్థాన్ మిలిట‌రీ కోర్టు. ఫీల్డ్ జ‌న‌ర‌ల్ కోర్ట్ మార్ష‌ల్ కుల్‌భూష‌ణ్‌ను విచారించి ఉరిశిక్ష వేసింది. అత‌నో రా ఏజెంట్ అని, దేశంలో ప్ర‌మాద‌క‌ర చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని పాక్ ఆరోపించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu