ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
posted on Jan 16, 2026 2:23PM
.webp)
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మార్చి 10కి వాయిదా వేసింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ కొనసాగుతుందని, ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇక అదనపు విచారణ అవసరం లేదని పేర్కొంది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని సిట్‌ను ప్రశ్నించింది. ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరఫున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. దీనిపై స్పందించిన జస్టిస్ నాగరత్న“ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండలేము కదా? మీ ఉద్దేశం పూర్తయిందా లేదా? ప్రభాకర్‌రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.ఈ కేసు దర్యాప్తులో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం, ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకొని తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.