యాంకర్ అనసూయ ఫిర్యాదు... 42 మందిపై కేసు

 

ప్రముఖ యాంకర్, సినీ నటి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తున్నారంటూ అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 42 మందిపై కేసు నమోదు చేశారు. కొందరు వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఖాతాదారులపై క్రిమినల్ డిఫమేషన్, సెక్సువల్ హెరాస్‌మెంట్, ఏఐ ఫోర్జరీ వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గతేడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్‌లైన్ వేధింపులు తీవ్రంగా పెరిగాయని అనసూయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా  తనను లక్ష్యంగా చేసుకుని అశ్లీల వ్యాఖ్యలు చేయడం, లైంగిక దూషణలకు పాల్ప డటం, బెదిరింపులు పంపడం వంటి చర్యలు జరుగుతు న్నాయని ఆమె ఆరోపిం చారు. కొందరు కావాలనే క్యాంపెయిన్ తరహాలో తనపై దాడి చేస్తున్నారని అనసూయ తన ఫిర్యాదులో వెల్లడించారు.ఓ ఇంటర్వ్యూ లో తన అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాతే తనపై ఈవిధంగా ట్రోలింగ్ మొద లైందని అనసూయ తెలి పారు.

 తాను చేసిన వ్యాఖ్య లను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నారని అనసూయ తన  ఫిర్యాదులో పేర్కొ న్నారు. కొందరు ఏఐ సాంకే తికతను ఉపయోగించి మార్ఫింగ్, ఫోర్జరీ కంటెంట్ సృష్టించారని కూడా ఆమె ఆరోపించారు.బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజిని వీరితోపాటు మరికొందరిపై అనసూయ ఫిర్యాదు చేసింది. 

అంతేకా కుండా నిందితుల పేర్లతో పాటు సంబంధిత సోషల్ మీడియా ఖాతాల లింకులను కూడా అనసూయ తన ఫిర్యాదుతో జత చేసి పోలీసులకు సమర్పించారు. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజిని తో సహా మొత్తం 42 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదుల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవస రమైతే నిందితులను అదుపులోకి తీసుకుం టామని తెలిపారు. ప్రస్తుతం నిందితుల సోషల్ మీడియా ఖాతాల వివరాలు, పోస్టులు, వీడియోలను సేకరించి సాంకేతిక ఆధారాలతో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu