ఏపీలో ఆ ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్
posted on Jan 16, 2026 1:47PM

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై విధులకు కచ్చితమైన సమయానికి హాజరుకావాలని ఆలస్యంగా వస్తే ఆ రోజు వేతనంలో కోత విధిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా మెరుగైన సేవలు అందించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సంస్కరణల ద్వారా సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సర్కార్ లక్ష్యమని తెలుస్తోంది. ఇటీవలే ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను సైతం మార్చింది. గ్రామ సచివాలయాలను స్వర్ణ గ్రామాలుగా, వార్డు సచివాలయాలను స్వర్ణ వార్డులుగా మార్చేందుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు సచివాలయ పాలనలోనూ మార్పులు తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది.