తమిళనాడు మంత్రులపై ఐటీ శాఖ ఫిర్యాదు..


తమిళనాడు మంత్రులపై ఐటీ శాఖ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. మంత్రులు ఆర్ కామరాజ్, రాధాకృష్ణన్ లతో పాటు, ఢిల్లీలోని తమిళనాడు ప్రత్యేక ప్రతినిధి సుందరం ఇళ్లపై ఆదాయపు పన్ను అధికారులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రి విజయభాస్కర్ నేతృత్వంలోనే ఆర్కే నగర్ లో డబ్బులు పంచుతున్నారని సమాచారం రావడంతో అధికారులు అక్కడికి వెళ్లగా..వారు సోదాలు జరపడానికి నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఐటీ శాఖ అధికారులు.. తమ విధులను తాము చేసుకోనీయకుండా మంత్రులు అడ్డుపడుతున్నారని.. తమ అధికారాన్ని ఉపయోగించి అడ్డంకులు సృష్టించారని.. కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కాగా దీనిపై కేంద్రం స్పందన వెలువడాల్సి వుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu