ఉభయ సభలు రేపటికి వాయిదా

 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గందరగోళం కొనసాగుతునే ఉంది. విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. బీహార్‌లో ఎన్నికల ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR), గోవా అసెంబ్లీలో  ఎస్టీలకు సీట్లు రిజర్వ్ అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశాలపై విపక్షాలు నిరసన చేపట్టాయి. ఎంత చెప్పిన సభ్యులు వినకపోవడంతో సభల్లో గందరగోళం నెలకొంది. 

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితాకు ప్రత్యేక నిశిత సవరణ (సర్‌) చేపట్టడం, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే ప్రకటించడం వంటి అంశాలపై వెంటనే చర్చను చేపట్టాలన్న విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. లోక్ సభ  స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సభ మొదలైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష సభ్యుల నిరసనలకు దిగారు. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ ఛైర్ పర్సన్ హరివంశ్ ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీనితో ఇరు సభలు రేపటికి వాయిదా వేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu