ఖమ్మంలో శ్రీవారి ఆలయం కోసం స్థలాల పరిశీలన తుమ్మలతో టీటీడీఅధికారుల భేటీ
posted on Jul 24, 2025 4:25PM

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖమ్మంలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై ఇప్పటికే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు జరిపారు. ఆ చర్చల నేపథ్యంలో టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, టీటీడీ స్తపతి ఖమ్మంలో అనువైన స్థలాన్ని గురువారం (జులై 24) పరిశీలించారు. అనంతరం మంత్రి తుమ్మల తో సమావేశమయ్యారు. ఖమ్మం సమీపంలోని అల్లీపురం వద్ద ఉన్న 60 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం వీరు పరిశీలించారు. అలాగే రఘునాథపాలెం మండలంలోని స్వామి నారాయణ్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మాణం జరుగుతోంది.
ఇదే ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే శ్రీవారి ఆలయం నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రాంతాన్ని కూడా టీటీడీ అధికారులు పరిశీలించారు. అనం తరం మంత్రి తుమ్మలతో భేటీ అయిన టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, స్థపతి ఆలయ నమూ నాలను పరిశీలించారు.. ఆగమ పండితులు, టీటీడీ స్థపతి నిర్ణయించిన ప్రాంతంలో త్వరలోనే ఆలయ నిర్మాణ స్థలాన్ని ఖరారు చేసి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని తుమ్మల తెలిపారు.