మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం
posted on Jul 24, 2025 4:17PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీతో గురువారం (జులై 24) భేటీ అయ్యారు. ఈ భేటీలో రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరీ తదితరులు కూడా పాల్గొన్నారు.
ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఎంపైరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు, విద్యా , ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో ఆమెదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిన బిల్లు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కేబినెట్ తీర్మానం, ఆర్డినెన్స్ తదితర అంశాలపై చర్చించారు.