ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై పోలీసులు హెచ్చరిక

 

హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నెరగాళ్లు విసురు తున్న వలలో చిక్కుకుని చాలా మంది బాధితులు లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అధిక వడ్డీ ఆశ చూపించగానే బాధితులు ముందు వెనక ఆలోచించ కుండా పెట్టుబ డులు పెట్టేందుకు  సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు బాధితుల వద్ద నుండి దొరికి నంత దోచుకుం టున్నారు. ఇలా నగరంలో పలు కేసులు నమోదు కావడంతో అప్రమత్తమైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై హెచ్చ రికలు జారీ చేశారు.

సోషల్ మీడియా ద్వారా నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. చిన్న ఇన్వెస్ట్‌ మెంట్‌ తో మొదలై పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకుం టున్నా రని పోలీసులు తెలిపారు. నకిలీ వెబ్‌సైట్లలో ఫేక్ లాభాలు చూపించి, ట్యాక్స్‌లు, ఫీజుల పేరుతో మరిన్ని డబ్బులు వసూలు చేస్తున్నారని అట్టి వారి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తం గా  ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు..ప్రజలు ఎందులోనైనా పెట్టుబడి పెట్టే ముందు ఆ ప్లాట్‌ ఫారమ్‌ను ధృవీ కరించుకోవాలని, అధిక లాభాల హామీలను నమ్మి మోసపోకూడదని పోలీసులు సూచి స్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే 1930 నంబర్ లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పోలీ సులు విన్నపం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu