ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో... సిట్ విచారణకు ఎమ్మెల్సీ నవీన్‌ రావు

posted on: Jan 4, 2026 11:27AM

 

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రైవేట్ డివైస్‌తో ఫోన్ ట్యాపింగ్‌ చేపించినట్లు నవీన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు (ఆదివారం) ఉదయం 11 గంటలకు నవీన్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పొలిటికల్ లీడర్లను సిట్ అధికారులు విచారించనున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ కీలక నేతలను సైతం విచారించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉన్న నవీన్‌ రావుకు 2019లో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...