వైభవంగా శ్రీరామమందిరం శంకుస్థాపన

 

నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పాతపాళెంలో శ్రీరామమందిరం శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు, గ్రామస్తులు, మత్స్యకారులు పెద్దఎత్తున హాజరై శోభాయమానంగా ఈ వేడుకను నిర్వహించారు.

ఈ సందర్భానికి ముఖ్య అతిథులుగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గీతలు, వేద మంత్రాల నడుమ ఆలయ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు

ఈ సందర్బంగా మాజీ మంత్రి  సోమిరెడ్డి  మాట్లాడుతు, “శ్రీ రామచంద్రుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని భక్తిశ్రద్ధలతో చేపట్టిన ఆలయ నిర్మాణానికి నేను ఎల్లప్పుడూ సహకరిస్తాను” అని అన్నారు. మత్స్యకారులు ఎంతో ఆత్మీయంగా కలసి చేపట్టిన ఈ సేవా కార్యక్రమానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా వీలైనన్ని నిధులు మంజూరు చేసేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu