పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి కసబ్‌కు మద్దతు లేదు
posted on Nov 10, 2011 12:44PM
అద్
దు: ముంబై దాడి కేసులో నిందితుడు అజ్మల్ అమీర్ కసబ్ ను ఉరి తీయాలని, అతను ఉగ్రవాదేనని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్ అన్నారు. సార్క్ సదస్సుకు హాజరైన ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కసబ్ చర్యలతో పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధం లేదని, పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి కసబ్‌కు ఏ విధమైన మద్దతు లేదని ఆయన అన్నారు. సమఝౌత ఎక్స్‌ప్రెస్ పేలుడుకు పాల్పడినవారికి కూడా శిక్ష పడాలని ఆయన అన్నారు. ముంబై దాడుల కేసు త్వరితగతి పరిష్కారానికి తమ ప్రభుత్వం భారతదేశానికి సహకరిస్తుందని ఆయన చెప్పారు. జమాత్ ఉద్ దావా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు విడుదల చేయడంపై ప్రశ్నించగా పాకిస్తాన్ అత్యున్నత కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన సమాధానమిచ్చారు.