వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు

 

ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో సిట్ అధికారుల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో తిరుపతి లోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి,  మిథున్ రెడ్డినివాసం, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా నాలుగు బృందాలుగా విడిపోయిన సిట్ అధికారులు.. పలు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఇక, మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు కార్యాలయ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. సోదాల సమయంలో పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేసినట్లు తెలుస్తుంది. 

ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి లో ఉన్నట్లు సమాచారం. ఏపీ లిక్కర్ స్కాం లో అరెస్టైన  మిథున్ రెడ్డి ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు. మొత్తం 71 రోజుల పాటు ఈ కేసులో మిధున్ జైలులో ఉన్నారు. మద్యలో ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు అనుమతి కోరడంతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్, బెంగళూరులోని ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సిట్ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈ కేసులో ఏ4 నిందితుడిగా మిథున్‌రెడ్డి ఉన్నారు. ఆయనపై త్వరలో సిట్ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu