ఇండిగో నుంచి ప్రతిదీ దేశం కోసం కాదు..అదానీ కోసమేనా!?
posted on Dec 11, 2025 4:07PM

ఇండిగో వ్యవహారం వెనక అదాని ప్రయోజనాలు దాగి ఉన్నాయా? అసలు అదానీకి మోదీకి ఉన్న సంబంధ బాంధవ్యాలేంటి? సీ పోర్ట్, ఎయిర్ పోర్ట్, రోడ్లు, విద్యుత్ ఇలా రంగమేదైనా సరే, అదాని పరం చేయడానికే మోడీ ఇదంతా చేస్తున్నారా? అంటే మనం ఇప్పటి వరకూ జరిగిన పరిణామ క్రమం ఏంటో ఒకసారి పరిశీలించాల్సి వస్తుంది.
తాజాగా తలెత్తిన ఇండిగో వ్యవహారంలో అదానీ సంస్థల పాత్ర బహిర్గతమైంది. అదెలాగంటే అదానీ ఏవియేషన్, పైలట్ ట్రైనింగ్ లోకి అడుగు పెట్టారు. అదానీ ట్రైనింగ్ సెంటర్లో ఇబ్బడి ముబ్బడిగా పైలట్ ట్రైనింగ్ కి జనం చేరాలంటే అందుకు తగిన విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్పించాలి. అందులో భాగంగానే డీజీసీఏ ద్వారా పైలట్ల పని గంటలపై ఒక రూల్ పాస్ చేశారు. దీంతో ఇండిగోకి వేలాది మంది పైలట్ల అవసరం ఏర్పడింది. అలా ఇండిగో సంక్షోభం తలెత్తిందని ఒక అంచనా.
కేవలం ఈ ఒక్క అంశం మాత్రమే కాదు.. డిమానిటైజేషన్, రైతుల గిట్టుబాటు ధరల విషయంలోనూ ఇదే జరిగిందని చెప్పాలంటారు పలువురు పరిశీలకులు. అదానికి లాభం చేకూర్చడమే ధ్యేయంగా ఈ మొత్తం నెట్ వర్క్ పని చేస్తుందంటే అతిశయోక్తి కాదేమో.
ఒకప్పుడు బీజేపీ గురుత్వాకర్షణ శక్తి మొత్తం నాగ్ పూర్ లో కేంద్రీకృతమయ్యి ఉండేది. అదే, 2014 నుంచి ఈ గ్రావిటీ మొత్తం గుజరాత్ తరలి వెళ్లింది. మరీ ముఖ్యంగా మోడీ, షా ఎక్కడుంటే అక్కడ కేంద్రీకృతం కావడం ప్రారంభమయ్యింది. ఇంకా జూమ్ వేసుకుని చూస్తే.. ప్రస్తుత బీజేపీ పాలన మొత్తం అదానీ కేంద్రంగా నడుస్తున్నట్టుగా బయట పడుతుందంటారు కొందరు రాజకీయ విశ్లేషకులు.
అందుకు వీరు ఎవర్నైనా బలి పెట్టేస్తారనడంలో ఎంత మాత్రం అనుమానం లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇండిగో వ్యవహారంలో దేశం పరువు ప్రతిష్టలు ఎంతగా మంట గలసి పోతున్నా సరే, లెక్క చేయకుండా అది మిస్ ఫైర్ కావడంతో వెంటనే కోలుకుని ఆ నింద మొత్తం ఒకరిపై నెట్టేయడం అంటే అది మాములు విషయం కాదు. అందుకే ఆ వ్యక్తికి అంతటి మంత్రి పదవి ఇచ్చారా? అన్న డౌట్ కూడా వస్తుంది.
మోడీని గుడ్డిగా నమ్మే వారికి తెలియని విషయం ఏంటంటే.. ఏపీలో ఉన్న అన్ని పోర్టులు అదానీకి రాసిచ్చేశారు. విశాఖ గంగవరం పోర్ట్, వైజాగ్ పోర్టు ప్రస్తుతం అదానీ గుప్పెట్లోకి వెళ్లిపోయాయి. గాజువాక స్టీల్ ప్లాంట్ భూముల విషయానికి వస్తే.. ఒక సిమెంటు కంపెనీకి ప్లాంట్ కోసం భూమికావాలి. అందుకోసం ఏకంగా విశాఖ ఉక్కునే అమ్మేయాలన్న ప్రతిపాదనలు వెలుగు చూశాయి.
కరోనా టైంలో కూడా లాభాల్లో ఉంటే.. దాని ఫర్నీసులు కొంత కాలం నిలిపేశారు. అట్లుంటది మోడీతో అనంటారు. విశాఖలో అదానీ సెంటర్ కోసం వందల ఎకరాల భూములిచ్చేస్తున్నారు. ఇలా నేరుగా చేస్తే వ్యతిరేఖత వస్తుందని భావించి గూగుల్ ముసుగు వేశారని చెప్పుకొస్తున్నారు. వచ్చే రోజుల్లో విశాఖపట్నం కాస్తా అదానీ పట్నంగా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
దేశంలో ఆహార గోదాములన్నిటినీ అదానీకి రాసిచ్చేయడం వెనక.. రైతులకు గిట్టుబాటు ధరల్లేకుండా కేవలం కార్పొరేట్ కంపెనీలు మాత్రమే బాగు పడాలన్న ఉద్దేశం దాగి ఉందని అంటారు. రైతులు ఢిల్లీలో ఘోరమైన చలిలో ఉద్యమం చేశారు. ఆ రైతుల్లో కొందరు చలికి తట్టుకోలేక మరణించాక.. అప్పుడు రైతు గిట్టుబాటు ధరల చట్టం చేశారు.
ఇక లడఖ్ లో 45 వేల ఎకరాల భూమి వ్యవహారం. అక్కడంతా కొండల మయం. ఆ భూమిని కూడా అదానీ పరం చేసేశారు. సోలార్ పవర్ కోసం కట్టబెట్టేశారు. అందుకే ఆర్టికల్ 370 రద్దయ్యిందన్న విషయం ఎంత మందికి తెలుసు?
ఇదంతా గుర్తించని గుజరాతీ మార్క్ భక్త జనం.. హిందూ- ముస్లిం, భారత్- పాక్ మాయలో పడిపోతుంటారు. దీంతో లఢాఖ్ భూముల విషయంలో పోరాడుతున్న సోనం వాంగ్ చుక్ అనే సైంటిస్టును విలన్ గా చిత్రీకరిస్తారు. అతడ్ని జైల్లో పెట్టినా.. అంతా దేశం కోసమే అనుకుంటారు. కానీ, ఇదంతా అదానీ కోసమని తెలుసుకోలేని పిచ్చితనం ఈ జనానిదని చెప్పుకొస్తారు కొందరు పరిశీలకులు.
ఇక మణిపూర్ అల్లర్ల సంగతి సరే సరి. ఈ ప్రపంచానికి తెలియదు.. అక్కడ ఎంతటి రక్తపాతం జరిగిందో. ఇదంతా ఎందుకంటే అక్కడ అద్భుతమైన లిథియం ఉంది. దీన్ని కూడా అదానీకి రాసివ్వడంలో భాగం. అందుకే ఆర్టికల్స్ రద్దవుతుంటాయి. కొత్త కొత్త చట్టాలు పుట్టుకొస్తుంటాయి. ఎవరైనా ఎదురొడ్డి పోరాడితే వారి ప్రాణాలు సైతం పోతుంటాయని అంటారు కొందరు విశ్లేషకులు.
ఛత్తీస్ గఢ్ విషయానికి వస్తే.. ఇటీవల ఎన్ కౌంటర్లో చనిపోయిన హిడ్మా ఉదంతం తీస్కుంటే.. నక్సలైట్ల ఉనికి లేని సమయంలో కూడా అతి పెద్ద ఉద్యమం తీసుకొచ్చారు. అదే 2026 మార్చి నాటికి నక్సలైట్ ఫ్రీ స్టేట్ గా చేయడం. దీని వెనక అసలు ఉద్దేశం ఏంటో చూస్తే.. హిడ్మా ఇక్కడ అడ్డుగా ఉన్నాడని చెప్పి అతడ్ని ఎన్ కౌంటర్ చేయించారు. ఎప్పుడైతే హిడ్మా అడ్డు తొలిగిందో.. ఆనాటి నుంచి అదానీ సంస్థ అక్కడ అడవులను నరికి బొగ్గు తవ్వకం ప్రారంభిస్తుంది. అందుకే తీవ్రంగా ఉద్యమిస్తున్నారు స్థానిక ఆదివాసీలు.
అంతెందుకూ ఏపీలో అదానీ స్మార్ట్ మీటర్స్ సంగతే తీస్కుంటే ఎంత దోపీడీ జరగనుందో ముందు ముందు తెలుస్తుందని అంటారు. ఇక కేజీ బేసిన్ వ్యవహారం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ కి పైపులైన్లు వేసి మరీ తోడేస్తున్న సంగతి తెలిసిందే. నాటి సీఎం ఏమయ్యారో విధితమే.
ఇక్కడ జనం ఎక్కడ మోసపోతుంటారంటే.. నాణానికి ఒక వైపు మాత్రమే చూడ్డం వల్ల. మోడీ అండ్ కో ఆడించే హిందూ- ముస్లిం, భారత్- పాక్ వంటి రాజకీయ నాటకాలు మరుగున పడిపోతుంటాయ్. ఒక వైపు బొమ్మ మాత్రమే చూపించి మరో వైపు అంబానీ, అదానీలకు ఈ దేశ ఆదివాసీల సంపద దోచి పెట్టేస్తుంటారని అంటారు ఈ వ్యవహారాలు తెలిసిన వారు.
పాక్ అంటే మనకు మాత్రమే శతృత్వం. అదే మోడీకి కాదు. అందుకే ఆయన ఎవరికీ తెలీకుండా ఆ దేశం వెళ్లి విర్యానీలు భోం చేసి వచ్చేస్తుంటారు. సరిగ్గా అదే సమయంలో పాక్ ని ఒక శతృదేశంగా చిత్రీకరించి జనాన్ని ఆ మాయలో పడేలా చేస్తుంటారన్నది ఇక్కడ స్పష్టాతి స్పష్టం. కానీ దాన్నెవరూ పట్టించుకోకుండా టోటల్ బ్లర్.. చేసి బొమ్మ చూపిస్తారన్న ఆరోపణలున్నాయ్.
బీహార్లోనూ అంతే లక్ష ఎకరాల భూమిని కేవలం రూపాయ ధరకు అంబానీ పరం చేసేశారు. అదేమంటే జనం ఇళ్లు, గుడులు కూలదోస్తున్నారు దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ టైంలో మోడీ భూటాన్ పర్యటనలో ఉన్నారు.. అయితే ఇక్కడికి మోడీ ఎందుకెళ్లారో చూస్తే.. ఆ వెంటనే ఆ దేశంలో అదానీ ప్రత్యక్షమై.. అగ్రిమెంట్ చేసుకున్నారు.
ఇదే కాదు దేశమేదైనా.. సరే, మోడీ ఏదైనా విదేశీ పర్యటన చేస్తే.. ఆ వెనక అదానీ వ్యాపార అగ్రిమెంట్లు దాగి ఉంటాయని తెలుస్తోంది. ఇది నిన్నమొన్నటి ఇండిగో అయినా, మరొకటైనా అంతా దేశం కోసమని అంటారు కానీ, అదానీ కోసమేనని తెలుస్తోంది. కానీ ఈ వ్యవహారమేదీ జనానికి ఎందుకు తెలీదంటే, దేశ వ్యాప్తంగా ఉన్న 13 మీడియా సంస్థలు అదానీ చేతిలో ఉండగా.. అంబానీ చేతిలో 21 ఉండటంతో ఇదంతా కనిపించని మహామాయగా జరుగుతూనే వస్తోంది. ఇలాంటివి ఇంకెన్ని.. సంక్షోభాలు చూడాలో ఆ పైవాడికే ఎరుక!!!