ఏఎన్ఆర్ పుట్టిన గడ్డ గుడివాడకు రావడం గర్వంగా ఉంది : హీరో నాగార్జున

 

నాన్న ఏఎన్ఆర్ పుట్టిన గుడివాడ రావడం తనకు ఎంతో భావోద్వేగంగా ఉందని సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. ఏఎన్ఆర్ స్థాపించిన సంస్థలు తనకు ఎప్పుడు ప్రత్యేకమేనవేనని నాగార్జున తెలిపారు ... ఏఎన్ఆర్ కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్ నిమిత్తం రూ.2కోట్ల రూపాయలను ప్రకటించారు.

గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండో రోజు వేడుకల్లో సినీ హీరో అక్కినేని నాగార్జున, హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్, గుడివాడ, పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజాలు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. ముందుగా నాగార్జున సభా వేదిక మీదకు చేరుకోగానే అభిమానులు, విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు.

 అనంతరం హీరో నాగార్జునకు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శాలువా, పుష్పగుచ్చం అందిస్తూ  గౌరవ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ..అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్ల మీద... కళాశాల విద్యార్థుల  స్కాలర్షిప్ కోసం... కుటుంబం తరఫున రూ.2కోట్లను అందిస్తున్నట్లు ప్రకటించారు.ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంతో పాటు గర్వంగా ఉందనీ నాగార్జున పేర్కొన్నారు.

మనుషులు శాశ్వతం కాదనీ వారు చేసే పనులే శాశ్వతమని,తాను చదువుకోలేక పోయినా...వేలాదిమంది చదువు, వారి బంగారు భవిష్యత్తు కోసం  నాగేశ్వరరావు కళాశాల స్థాపించారనీ ,రైతు బిడ్డ అయిన నాగేశ్వరరావుకు...చదువు అంటే ఎంతో ఇష్టమన్నారు.

సినిమాకు రూ. 5వేలు వచ్చే 1951 సంవత్సరాల్లో.... లక్ష రూపాయలు కళాశాలకు విరాళంగా ఇచ్చారనీ, ఏఎన్ఆర్ కళాశాలలో చదివిన విద్యార్థులు నేడు దేశ,విదేశాల్లో, ఎంతో ఉన్నత స్థానాల్లో నిలవడం సంతోషకరమన్నారు. నా తరపున నా కుటుంబ సభ్యుల తరఫున... ప్రతి ఏటా విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందిస్తామన్నారు. కళాశాలలో ఏర్పాటు చేయబోయే స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధికి... రేపు వేడుకల్లో పాల్గొనే మంత్రి లోకేష్ సహకరించేలా ఎమ్మెల్యే రాము కృషి చేయాలని నాగార్జున కోరారు.

గుడివాడలో నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు.. చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు నాగార్జున చెప్పారు. నన్ను కింగ్, మన్మధుడు, మాస్ అని రకరకాల పేర్లతో పిలుస్తారని... నేను అక్కినేని నాగేశ్వరావు  అబ్బాయి నాగార్జున అంటేనే ఇష్టమన్నారు. నాగార్జున మాట్లాడుతున్నంతసేపు  అభిమానులు..విద్యార్థులు కేరింతలు కొట్టారు.

హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ...మహోన్నత ఆలోచనతో ఏర్పడిన ఏఎన్ఆర్ కలశాల ఎందరికో మంచి భవిష్యత్తు అందించడమే కాక, దేశానికి గొప్ప పౌరులను ఇచ్చిందన్నారు. ఈ కళాశాలలో చదివే నేను... హైకోర్టు జస్టిస్ స్థాయికి ఎదిగాననీ పేర్కొన్నారు.

ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ... నేడు నాగార్జున రావడంతో గుడివాడలో ఎప్పుడూ లేనంత సందడి నెలకొందన్నారు. నేను కళాశాల చదివే రోజుల్లో నాగార్జునకు  ఫ్యాన్స్ క్రేజీ చెప్పలేనంత ఉందన్నారు.
 ప్రపంచం గర్వించదగ్గ నటుడుగా ఎదిగిన అక్కినేని మన గుడివాడ వాసి కావడం మనందరికీ గర్వకారణం అన్నారు.

గుడివాడ ప్రజలందరూ చదువుకోవాలని ఎంతో గొప్ప ఆశయంతో కళాశాల స్థాపించారనీ కొనియాడారు. చదువు అంటే ఎంతో ఇష్టపడే అక్కినేని... అనేక యూనివర్సిటీలకు చెప్పలేనన్నీ గుప్త దానాలు చేశారన్నారు. ఆయన చేసిన సేవలను చూస్తుంటే, చదువు అంటే అక్కినేనికు ఎంత మమకారమో అర్థం అవుతుందన్నారు. 

కళాశాలకు డబ్బు మాత్రమే కాకుండా ఆయన పేరు కూడా అందించారన్నారు. అంతటి మహనీయుడు కుటుంబ సభ్యులతో కలిసి వేదికను పంచుకోవడం ఆనందదాయకం అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గుడివాడ అంటే ఎన్టీఆర్ ఏఎన్నార్ పుట్టిన గడ్డ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు.

వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గుడివాడ వచ్చిన నాగార్జునకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు చెప్పారు. నాడు ఏఎన్ఆర్ ఇచ్చిన లక్ష రూపాయలు ఏ విధంగా సద్వినియోగం అయ్యాయో... నేడు విద్యార్థుల భవిష్యత్తు కోసం నాగార్జున ఇచ్చిన రెండు కోట్లను అదేవిధంగా సద్వినియోగం చేస్తామని సభా వేదికగా పేర్కొన్నారు. 

నాగార్జున వస్తున్నారని తెలిసి నేను 18 కిలోలు తగ్గిన... ఆయన ముందు ఏమాత్రం అనడం లేదని ఎమ్మెల్యే రాము అన్న మాటలకు సభా అంత నవ్వుకున్నారు.మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ పుస్తకాన్ని  అక్కినేని నాగార్జున, ఎమ్మెల్యే రాము ఇతర ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, అక్కినేని కుమార్తె సుశీల, ఏఎన్ఆర్ కళాశాల కమిటీ పెద్దలు, వేడుకల నిర్వహణ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu