అంబులెన్సు లో వేయిల ఖర్చు.. అందుకే బైక్ మీద పేషేంట్..
posted on May 29, 2021 4:54PM
కరోనా లాక్ డౌన్ అందరికి ఒకేలా ఉండదు. ఉన్నోడు తిన్నది అరగక ఏడుస్తుంటే. లేనోడు కడుపు మాది చస్తున్నారు. ఇది ఓన్లీ ఫుడ్ విషయం లోనే కాదు. కోవిద్ ట్రీట్మెంట్ విషయంలో కూడా.. డబ్బులు ఉన్నవాడికి సరైన వైద్యం అందుతుంది. డబ్బులు లేని మిడ్డిల్ క్లాస్, మరియు పూర్ పీపుల్ సరైన వైద్యం సరైన టైం కి అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. కరోనా మెడిసిన్ దగ్గరి నుండి, శాస్తే శవాన్ని మోసుకపోవడానికి వెళ్లే అంబులెన్స్ కూడా ఇప్పుడు రేట్లు పెంచాయి. అడ్డగోలుగా మెడికల్ సర్వీసుల ధరలన్నీ మారిపోయాయి. అంబులెన్సుల ధరలైతే ఇక చెప్పే పని లేదు. ఇష్టమొచ్చినట్లుగా డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్ ఖర్చులు భరించలేక ఓ పెద్దాయన చనిపోతే అతడి శవాన్ని కుటుంబీకులు బైక్‌పై తీసుకెళ్లారు. ఈ ఘటన చూసిన వారంతా.. లోకం ఎలా తయారైందో అంటూ పలు రకాలుగా చర్చించుకున్నారు.
అది ఖమ్మం జిల్లా. ఆత్కూరు. మల్లారం గ్రామం. అతని పేరు ఎర్రనాగుల నారాయణ అతని వయసు 70 సంవత్సరాలు. అతను సుమారు వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మధిరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో శుక్రవారం గుండెల్లో నొప్పిగా ఉందని అతడు కుటుంబసభ్యులతో కలిసి మోటారు సైకిల్‌పై మధిరకు వస్తున్నాడు. సిరిపురం గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్ద చూపించుకోగా ఆయన మధిరలోని ఆసుపత్రిలో వైద్యం చేయించుకోమని సూచించాడు. మోటారు సైకిల్‌పై మధిరకు తీసుకెళ్తుండగా.. ఆత్కూరు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మోటారు సైకిల్‌పైనే మృతి చెందాడు.
ఏమిటి మనం ఎలాంటి సమాజం లో బతుకుతున్నాం..ఈ ప్రపంచంలో అతి పవిత్రమైనవి పుట్టుక చావు.. ఆ పవిత్రమైన వారికి కూడా ఇలాంటి వాటితో అపవిత్రం చేస్తున్నారు. ఈ కాలంలో ప్రజల మీద జాలిచూపాల్సింది పోయి.. ఇటు ప్రభుత్వం ఒకవైపు, హాస్పిటల్స్ మరోవైపు, మెడికల్ ఇంకోవైపు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రజల శవాల గుట్టలను సినిమా చూసినట్లు చూస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మనిషి రక్తంలో ఉండే మంచి అనే కణాలు చనిపోయాయనే చెప్పాలి. ఇప్పుడు కొందరికి కరోనా తీసుకపొవఛు.. ఈ కరోనా పేరుతో సొమ్ముచేసుకున్న వాళ్ళను మరోకి తీసుకుపోవచ్చు. రాజుల పాలు రాళ్ళ పాలు అయినట్లు.. ఎంత సంపాదించినా చివరికి మన వెంట ఏది రాదు.. ఆరు అడుగుల నెల తప్పా..