బ్రేకింగ్.. మంత్రి పెద్దిరెడ్డి క్వారీలో పేలుడు.. ఒకరు మృతి

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్వారీలో పేలుళ్లు జరిగాయి. పేలుడు ధాటికి బండరాళ్లు అర కిలోమీటర్ వరకు ఎగిరిపడ్డాయి. బండరాళ్లు మీద పడటంతో ఒకరు చనిపోయారు. చౌడేపల్లి మండలం కడియాల కుంటలో మంత్రి పెద్దిరెడ్డి క్వారీలు ఉన్నాయి. ఆ క్వారీల్లోనే పెద్ద పేలుడు సంభంవించింది. బండరాళ్లు అర కిలోమీటర్ వరకు ఎగిరిపడ్డాయి. అటుగా రోడ్డుపై వెళుతున్న మామిడికాయల ట్రాక్టర్ పైనా బండరాళ్లు పడ్డాయి. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న 25 ఏండ్ల జాకీర్ చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. 
గనులమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్వారీలోనే అక్రమ పేలుళ్లా? అని ఏపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంత్రి క్వారీలోనే రక్షణ లేకపోతే మిగతా చోట్ల పరిస్థితేంటి? అని మరోసారి ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి పై కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. అవినీతి సొమ్ము కోసం అమాయకుల ప్రాణాలు బలిగొంటారా అని ఆయన నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ చేస్తున్నారని, ఇటీవలే సీఎం జగన్ సొంత జిల్లాలో 10 మంది చనిపోయారని తెలిపారు. జాకీర్ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి క్వారీ మూసివేసి, సమగ్ర విచారణ జరపాలని అచ్చెన్నాయుడు కోరారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu