మంగళగిరిలో తెలుగుదేశం సభ్యత్వాలు లక్ష దాటాయి.. లోకేష్ మరో ల్యాండ్ మార్క్!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో ఘనత సాధించారు. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో పార్టీ సభ్యత్వ నమోదు డ్రైవ్ ను విజయవంతం చేశారు. తెలుగుదేశం పార్టీకి పెద్దగా లాయకీ లేని నియోజకవర్గంగా ముద్రపడిన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలి సారి పరాజయం పాలైన లోకేష్.. పార్టీ అధినేత కుమారుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రెండో సారి సేఫ్ నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉండి కూడా.. పోయిన చోటే వెతుక్కుంటాను.. అపజయం ఎదురైన చోటే విజయ కేతనం ఎగురవేసి సత్తా చాటుతానని పట్టుబట్టి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

2019 ఎన్నికలలో మంగళగిరిలో ఎదురైన పరాభవాన్ని చాలెంజ్ గా తీసుకున్నారు. ఆ తరువాత ఐదేళ్ల పాటు మంగళగిరి నియోజకవర్గాన్నే తన నివాసంగా మార్చుకున్న లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా వినా మరెన్నడూ నియోజకవర్గాన్ని విడిచి పెట్టలేదు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై అందరివాడు అనిపించుకున్నారు. విజయం తరువాత కూడా ప్రజాదర్బార్ లతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల విశ్వాసాన్ని ఆయన చూరగొన్న ఫలితమే నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పార్టీ సభ్వత్వాల సంఖ్య లక్ష దాటింది. అంతే కాకుండా తెలుగుదఏశం శాశ్వత సభ్వత్వాల విషయంలో కూడా మంగళగిరి నియోజకవర్గమే టాప్ లో నిలిచింది.  

పార్టీ సభ్వత్వాలను నజరానాలతోనూ, ముడుపులతోనూ చేయించడం సాధ్యమయ్యే పరిస్థితి ఉండదు. ఎవరైనా పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే ఆ వ్యక్తికి పార్టీ పట్ల అపేక్ష, అభిమానం ఉండాలి. లోకేష్ జనంతో మమేకమై వారి విశ్వసనీయత పొందడం వల్లనే నియోజకవర్గంలో జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం మంగళగిరి. గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో అరవై ఆరు శాతం ఓట్లు లోకేష్‌కు పడ్డాయి. దాదాపుగా లక్షా డెభ్బై వేల ఓట్లు వచ్చాయి. ఓట్లు వేసిన వారంతా టీడీపీ సభ్యులు కాదు. కానీ వారిలో లక్ష మందికిపైగా ఇప్పుడు తెలుగుదేశం కుటుంబంలో సభ్యులయ్యారు.  కార్యకర్తలకు లోకేష్ అండగా ఉంటారన్న భరోసా కలగడంతోనే ఈ స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu