కిమ్ జాంగ్ ఉన్ ను చంపడానికి బిన్ లాడెన్ టీమ్..!
posted on Apr 13, 2017 11:49AM

ఉత్తర కొరియా నియంతగా పరిపాలన సాగిస్తున్న కిమ్ జాంగ్ ఉన్ ను చంపడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తుందా..? అవుననే అంటున్నాయి ఉత్తర కొరియా మీడియా కథనాలు. కిమ్ జాంగ్ ఉన్ ను చంపడానికి అమెరికా పావులు కదుపుతుందని.. కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టిన సీల్ టీమ్ ను దక్షిణ కొరియాకు అమెరికా రహస్యంగా పంపిందని ఉత్తర కొరియా ఆరోపిస్తుంది. అంతేకాదు మిలటరీ డ్రిల్ కోసం 17 వేల సైనిక దళాలను దక్షిణ కొరియాకు పంపిన నేపథ్యంలో దీనిపై కూడా స్పందించి.. ఈ సైన్యాన్ని కూడా అందుకోసమే పంపించారని అంటున్నారు. కిమ్ జాంగ్ ఉన్ ను మట్టుబెట్టడం ద్వారా లిబియాను ఆక్రమించుకున్నట్టుగా తమ దేశాన్ని ట్రంప్ ఆక్రమించుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు. ఇక ఉత్తర కొరియా చేసిన వ్యాఖ్యలకు గాను అమెరికా నేవీ కమాండర్ గేరీ రోజ్ స్పందించి వివిధ రకాల సైనిక విన్యాసాలు చేయాల్సి ఉండటంతో అంత సైన్యం వస్తోందని పేర్కొన్నారు.