ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా...
posted on Apr 13, 2017 12:20PM
.jpg)
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణ రెడ్డి ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 10.3 లక్షల పరీక్షలు రాయగా ఫస్టియర్ లో మొత్తం 77 శాతం ఉత్తీర్ణత పొందగా.. సెకండ్ ఇంటర్ లో 86 శాతం ఉత్తీర్ణత పొందారు. అయితే ఈసారి పరీక్షల్లో బాలికలదే హవా.
* ఫస్టియర్ ఇంటర్ లో కృష్ణజిల్లా ఫస్ట్ ప్లేస్ (77 శాతం)
* రెండోస్థానంలో నెల్లూరు (69 శాతం)
* మూడో స్థానంలో ప.గో జిల్లా (67 శాతం)
సెకండ్ ఇంటర్ లో 86 శాతం ఉత్తీర్ణత పొందారు
* సెకండియర్ ఇంటర్ లో కృష్ణజిల్లా ఫస్ట్ ప్లేస్ (86 శాతం)
* సెకండియర్ ఫలితాల్లో నెల్లూరు సెకండ్ ప్లేస్ (80 శాతం)
కాగా ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో కడప జిల్లా లాస్ట్ ప్లేస్ నిలిచింది.
ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఫస్ట్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయడం ఇదే తొలిసారి.. కార్డు స్థాయిలో కేవలం 24 రోజుల్లో ఫలితాలు విడుదల చేశామన్నారు. అలాగే ప్రాక్టికల్స్‌లో తొలిసారి జంబ్లింగ్ విధానం అమలు చేశామన్నారు. మే 15 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. అలాగే వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫలితాల్లో కూడా గ్రేడింగ్ విధానం అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అలాగే 80 శాతం ఉత్తీర్ణతతో ఎప్పటిలాగే బాలికలే పైచేయిగా నిలిచారు. బాలురు 77శాతం ఉత్తీర్ణులు అయ్యారు.