తెలంగాణ బిల్లును గట్టేక్కిస్తాం: కమల్‌నాథ్

 

 

 

లోక్ సభలో తెలంగాణ బిల్లును ఆరునూరైనా గట్టేకిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లుపై సభలో చర్చ జరగకపోయినా పార్టీకి వచ్చే నష్టం ఏమిలేదని అన్నారు. మూజువాణి ఓటుతోనైనా సరే తెలంగాణ బిల్లును గట్టెక్కిస్తామని వివరించారు. బిల్లుపై అర్ధవంతమైన చర్చ జరపాల్సిన బాధ్యత భారతీయ జనత పార్టీ పైన ఉందని అన్నారు. సీమాంద్ర కు బిజెపి ఎలాంటి న్యాయ౦ చేయాలనీ భావిస్తున్నారో అది వారే తేల్చుకోవాలని చెప్పారు. సభలో చర్చ జరిగేందుకు సీమాంధ్ర నాయకులు సహకరించాలని...ఆందోళనలు మాని చర్చలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu