లోక్ సభ 3గంటలకు వాయిదా

 

 

 

మూడోసారి వాయిదా తరువాత ప్రారంభమైన లోక్ సభలో ఆందోలనకర వాతావరణం నెలకొనడంతో సభను స్పీకర్ 3గంటల వరకు వాయిదా వేశారు. సభలో సీమాంధ్ర ఎంపీలు సమైక్య నినాదాలతో హోరెత్తిస్తుండడంతో సభకు ఆటంకం కలుగుతుందని, సభ్యులు సభాసజావుగా జరగడానికి సహకరించాలని స్పీకర్ కోరినా సీమాంధ్ర ఎంపీలు పట్టించుకోవడంలేదు. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ వెల్ లోకి వెళ్లి నిరసన తెలుపుతుండడంతో సభ వరుస వాయిదాలు పడుతూ వస్తుంది. హోంమంత్రి షిండే సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు అనుమతించాలని కోరారు. దీంతో సభలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.