ఛీ న్యూస్ రిపోర్టరు అంటున్నారు- జర్నలిస్టు రాజినామా!
posted on Feb 22, 2016 10:36AM
.jpg)
దేశంలో వార్తాఛానళ్లలో ప్రతి ఒక్కటీ ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటాయన్నది బహిరంగ రహస్యమే! అయితే ‘జీ న్యూస్’లో పనిచేసే ఓ రిపోర్టరుకి ఈ పద్ధతి నచ్చలేదు. ముఖ్యంగా జేఎన్‌యూలో జరిగిన గొడవని తన వార్తా ఛానల్ తనకు తోచినట్లుగా మలచుకోవడం అతనికి నచ్చలేదు. దాంతో విశ్వదీపక్ అనే సదరు జర్నలిస్టు తన సంస్థకి రాజినామా చేసేశాడు. ‘నేను అనేక ప్రతిష్టాత్మక సంస్థలలో పనిచేసి వచ్చాను.
కానీ ఇక్కడికి వచ్చిన తరువాత నా వ్యక్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో పడిపోయాను. అందరూ నన్ను జీ న్యూస్ రిపోర్టరు అని కాకుండా ఛీ న్యూస్ రిపోర్టరు అని పిలుస్తున్నారు’ అంటూ తన రాజినామా పత్రంలో పేర్కొన్నాడు విశ్వదీపక్. పైగా ‘మోదీ మనకి ప్రధానమంత్రి అయితే కావచ్చు కాక. కానీ నిరంతరం ఆయన భజనే చేయడం బాగోలేదు’ అంటూ చిరాకుపడిపోయాడు. సంస్థకు మంచి మంచి వార్తలు తీసుకురావలసిన మనిషి, సంస్థనే వార్తల్లోకి నిలపడం జీన్యూస్‌కి ఎదురుదెబ్బే! ‘మా పనితీరు అంతా పారదర్శకంగా ఉంటుంది. ఒకవేళ విశ్వదీపక్‌కు మా పనితీరులో లోపం కనిపిస్తే ముందుగా మాతో వాటి గురించి చర్చించి ఉండాల్సింది’ అంటూ జీన్యూస్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది.