జేఎన్‌యూలో సైనికుల ఫొటోలు ఉంచాలి!
posted on Feb 25, 2016 11:40AM
.jpg)
జేఎన్‌యూలో భారతేవ్యతిరేక నినాదాలు చెలరేగడానికి కారణం అక్కడి విద్యార్థులలో తగినంత దేశభక్తి లేకపోవడమే అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జేఎన్‌యూలోని పరిస్థితుల గురించి మాజీసైనికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు జేఎన్‌యూ ఉపకులపతిని కలిసి విద్యార్థులలో దేశభక్తి పెంపొందేందుకు తమకు తోచిన సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ సూచనల్లో భాగంగా సైనిక అమరవీరుల చిత్రాలతో కూడిన ఒక స్తూపం ఉండాలని కొందరు అంటే, సైన్యానికి సంబంధించిన గుర్తులు ఏవన్నా క్యాంపస్ ఆవరణలో ఉంచితే మంచిదని మరి కొందరు భావించారు. మరోపక్క ప్రభుత్వం నడుపుతున్న విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ జాతీయ జెండాను ఎగురవేయాలన్న విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్న విషయం తెలిసిందే!