ఇక నుంచి గూడ్స్‌ రైళ్లకు కూడా టైం టేబుల్‌!

 

2015-16కి సంబంధించిన రైల్వే బడ్జట్‌ను సురేష్‌ప్రభు ప్రస్తుతం పార్లమెంటు ముందు ఉంచుతున్నారు. అంతా ఊహించిన విధంగానే కొత్త ప్రాజక్టులను కోకొల్లలుగా చేపట్టే బదులు రైల్వేలను పునర్‌వ్యవస్థీకరించేందుకే తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సురేష్‌ ప్రభు తెలియచేశారు.

 

- వచ్చే సంవత్సరం నాటికి 2,800 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్‌లను పూర్తిచేయనున్నట్లు మంత్రి తెలిపారు.

 

- 2,000 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌లను విద్యుతీకరించనున్నట్లు పేర్కొన్నారు.

 

- 2020నాటికి కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లు అన్నింటినీ కూడా తొలగించనున్నట్లు బడ్జెట్ సమాచారం.

 

- 2020నాటికే గూడ్స్ రైళ్లకు కూడా టైంటేబుళ్లను రూపొందిస్తామని మంత్రి తెలియచేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu