నలుగురిలో నవ్వులపాలైన ‘జగన్‘
posted on Oct 13, 2015 4:44PM

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీక్షలు ఫ్యాషన్ షోలను తలపిస్తున్నాయని ఆమధ్య ఓ నాయకుడు కామెంట్ చేశాడు. ఫ్యాషన్ షోలను తలపిస్తున్నాయంటే మరీ అంత బాగోదు కానీ... దీక్షలు మాత్రం ఫ్యాషన్ గా మారిపోయాయన్నది మాత్రం నిజం, ప్రతి చిన్నదానికీ దీక్ష అంటూ హడావిడి చేసేయడం... ఆ తర్వాత మూడ్రోజులకే చాప చుట్టేసి ఆస్పత్రిలో చేరిపోవడం, అక్కడ ఫ్లూయిడ్స్ ఎక్కించుకుని, జ్యూసులు జుర్రుకోవడం కామనైపోయింది, ఈమాత్రం దానికి దీక్ష చేయడం ఎందుకు? ప్రజల విలువైన సమయాన్ని వృథా చేయడం ఎందుకు?
నిరవధిక నిరాహార దీక్ష లేదా ఆమరణ దీక్ష...అంటే ప్రాణత్యాగానికి సిద్ధపడినట్లే కదా? లక్ష్యాన్ని సాధించడం కోసం చివరికి ప్రాణాలను సైతం వదిలేయడానికి రెడీ అయినట్లేగా? మరి అలాంటప్పుడు జగన్ ఆరోగ్యం క్షీణిస్తో్ంది? ఆరోగ్యం విషయమిస్తోంది? జగన్ ను ప్రభుత్వం చంపాలని చూస్తోంది? జగన్ దీక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే స్టేట్ మెంట్లు ఎందుకు? అసలు బీపీ లెవల్స్, షుగర్ లెవల్స్, కీటోన్స్ పర్సంటేజ్ ల గురించి ప్రాణత్యాగానికి సిద్ధమైన జగన్ కు ఎందుకు? ఇవన్నీ అతి సామాన్యుడి మదిలో మెదులుతున్న ప్రశ్నలు?
ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవడం కోసం ఆమరణదీక్షకు దిగిన జగన్... తాననుకున్న లక్ష్యాన్ని చేరకుండానే నాలుగైదు రోజుల్లోనే చాప చుట్టేయడం ఎందుకు? పైగా త్వరగా నన్ను ఆస్పత్రిలో చేర్చండన్నట్లుగా కీటోన్స్, బీపీ, షుగల్ లెవల్స్ పై అంత హడావిడి ఎందుకు? ఆరోగ్యం పాడైపోతుందనే బాధ ఎందుకు? ఏదో జరిగిపోతుందనే ఆందోళన ఎందుకు? ఆమరణదీక్షకు దిగితే ఆరోగ్యం పాడవుతుంది, ప్రాణం కూడా పోతుందనే విషయం తెలియదా? మళ్లీ ఈ డ్రామాలెందుకు? ఈమాత్రం దానికి దీక్షకు దిగడం ఎందుకు?
జగన్ లక్ష్యం మంచిదే కదా, మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రం సాధించిన పొట్టిశ్రీరాములు వలె ఎందుకు చివరివరకూ పోరాటం లేదు? అనుకున్నది సాధించేవరకూ నికార్సైన దీక్ష ఎందుకు చేయలేదు? జగన్ అనే కాదు...ఇటీవల ఎవరు దీక్షలు చేసినా అవన్నీ డ్రామాలను తలపిస్తున్నాయి, చిత్తశుద్ది లోపిస్తోంది? నికార్సైన దీక్షలు చేయడం లేదు... అందుకే ప్రజలు కూడా వాటిని పట్టించుకోవడం లేదు. ఏదో మొక్కుబడిగా మూడ్రోజులు దీక్ష చేయడం... ఆ తర్వాత ఎంచక్కా ఆస్పత్రిలో చేరడం, ఒకవైపు ఫ్లూయిడ్స్... మరోవైపు జ్యూసులు తాగడం ఫ్యాషన్ గా మారిపోయింది, అందుకే జగన్ దీక్ష నవ్వులపాలైంది.
ఎవరైనా సరే... ఓ మంచి లక్ష్యం కోసం దీక్ష చేపడితే ఆ ఆశయం కోసం పట్టుదల ఉండాలి? అంతకంటే ఎక్కువగా పంతం కావాలి? జనాన్ని కదిలించగలిగే ఆర్ధ్రత ఉండాలి? ఇవేమీ లేకుండా డ్రామాలాడేద్దామనుకుంటే ప్రజలేమీ పిచ్చోళ్లు కాదు. అది జగనైనా... చంద్రబాబైనా?...