రామోజీని కలవడం జగన్ కు ప్లస్సా... మైనస్సా?
posted on Sep 26, 2015 5:26PM
.jpg)
జగన్ రామోజీ భేటీ...ప్రైవేట్ మీటింగ్ లా జరిగింది, అందుకే వారిద్దరి భేటీపై ఈనాడు, సాక్షిలో చిన్న ఆర్టికల్ కూడా రాయలేదు, తెలుగు మీడియాలో జగన్-రామోజీ మీటింగ్ పెద్ద వార్త అయితే, ప్రతి చిన్న విషయాన్నీ కవర్ చేసే ఈనాడు, సాక్షిలో మాత్రం ఒక్క ముక్క రాయలేదు, పైగా రామోజీని జగన్ కలవడంపై వైసీపీ పొడిపొడిగా సమాధానం ఇచ్చింది, రామోజీ పెద్దమనిషి కాబట్టి సలహాలు తీసుకునేందుకే కలిశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటివారు చెప్పినా, ఇప్పటికివరకూ తిట్టిన నోటితోనే రామోజీని పెద్దమనిషి అనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ అసలు పార్టీలో సీనియర్ల మాటే వినడు...అలాంటిది బద్ధవిరోధి అయిన రామోజీ సలహాలు తీసుకుంటాడా అనేవాళ్లూ ఉన్నారు, రామో-ఛీ అన్న నోటితోనే రామో-జీ అనడంలో ఏదో ముఖ్యమైన కారణణమే ఉందంటున్నారు.
రామోజీరావును జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిశాడో కచ్చితంగా తెలియదు కానీ...మూడ్రోజులుగా ఆ ఇద్దరి మీటింగ్ పై రచ్చరచ్చ జరుగుతోంది, ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో, దానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చెప్పలేం, ఎందుకంటే ఆ భేటీ అలాంటిది?... అయితే రామోజీని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిశారు, ఏం మాట్లాడుకున్నారు? ఎవరు మెట్టుదిగారు? ఇలాంటివన్నీ పక్కనబెట్టేస్తే అసలు ఈ టింగ్ జగన్ కు ప్లస్సా? మైనస్సా?, రామోజీని తీవ్రంగా వ్యతిరేకించే వైఎస్ అభిమానులైతే జగన్ ఫిల్మ్ సిటీకి వెళ్లడాన్ని జీర్జించుకోలేకపోతున్నారు, మడమ తిప్పను మాట తప్పననే తమ అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రామోజీ కాళ్ల దగ్గరకు వెళ్లాడంటూ ఫేస్ బుక్లో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు, అలాగే తెలుగుదేశం వీరాభిమానులు కూడా జగన్ కు రామోజీ అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారు
వైఎస్ అభిమానుల ఆవేదనను పక్కనబెడితే జగన్మోహన్ రెడ్డి ఓ మెట్టుదిగి ఫిల్మ్ సిటీకి వెళ్లిమరీ రామోజీని కలవడం వైసీపీకి ఎంతోకొంత మేలే చేస్తుంది, తెలుగుదేశం వీరాభిమానులకు ఇది రుచించకపోయినా, కమ్మ కమ్యూనిటీలో జగన్ పట్ల కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుందనేది మాత్రం నిజం. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు...తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్ష నేత అనే హోదాను పక్కనబెట్టేసి పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లడంతోనే కాపు కమ్యూనిటీ అంతా తెలుగుదేశం వైపు తిరిగింది, ఆ భేటీ కాపుల్లో బలంగా ప్రభావం చూపింది,మనోడి దగ్గరికి చంద్రబాబు వచ్చాడు అనే భావన... మెజార్టీ కాపులను టీడీపీ వైపు మళ్లేలా చేసింది, ఇప్పుడు రామోజీని జగన్ కలవడం ద్వారా అలాంటి సంకేతాలే కమ్మ కమ్యూనిటీలోకి వెళ్తాయనేది సత్యం, ఇప్పటివరకూ జగన్ ను వ్యతిరేకిస్తున్న కొన్ని వర్గాల్లో ఈ మీటింగ్ పాజిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చే అవకాశమైతే ఉంది, దాంతో భవిష్యత్ లో వైసీపీకి మేలు జరిగే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఆవిధంగా రామోజీతో మీటింగ్ జగన్ కు ప్లస్సే కావొచ్చు