జగన్-రామోజీ భేటీ వెనుక అసలు రహస్యం? ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్
posted on Sep 26, 2015 3:27PM
.jpg)
ఒకపక్క జగన్ దీక్ష హడావిడి, మరోపక్క అనుమతి లేదన్న ప్రకటనలు, వీటన్నింటితో ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంటే, ఇవేమీ పట్టనట్టు ఏదో కొంపులు మునిగిపోతున్నట్టుగా అంత ఆర్జెంట్ గా ఫిల్మ్ సిటీకి వెళ్లిమరీ రామోజీని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలవాల్సి వచ్చింది? అసలేం జరిగింది?. తన తండ్రి వైఎస్ హయాం నుంచీ బద్ధశత్రువైన రామోజీ కాళ్ల దగ్గరకు జగన్ పరుగెత్తుకుని వెళ్లాల్సిన అంత కష్టం ఏమొచ్చింది? చదవండి ఎక్స్ క్లూజివ్ స్టోరీ
వైఎస్ తో పోల్చితే జగన్ చాలా మొండివాడని అంటారు, ఎవరినీ లెక్కచేయని నైజం, మోనార్క్ అంటుంటారు, అందుకే కష్టాలు తప్పవని తెలిసి కూడా సోనియాగాంధీని ఎదిరించి జైలుపాలయ్యాడని చెబుతారు, జగన్ మొండి వైఖరి వల్లే 2014 ఎన్నికల్లో చేతిదాకా వచ్చిన అధికారం అందకుండా పోయిందని, పైగా తన వద్దకు వచ్చిన వారెందరినో కాదనుకున్నాడని, అతని బీహేయర్ నచ్చకే మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్పారని, ఇవన్నీ కలిసి వైసీపీ ఓటమికి దారితీశాయని విశ్లేషిస్తారు. అయితే ఇంత మొండిగా మోనార్క్ లా వ్యవహరించే నైజమున్న జగన్ కు తట్టుకోలేని ఆపదేమో ముంచుకొచ్చిందని, అందుకే ఆగమేఘాల మీద రామోజీని కలిశాడని అంటున్నారు. తనకు జరగకూడని నష్టమేదో జరగబోతుందని తెలియడం వల్లే రామోజీ కాళ్ల దగ్గరకు పరుగెత్తుకుని వెళ్లాడని చెబుతున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా కచ్చితమైన ఆధారాలతో ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ‘ఈనాడు‘లో ప్రచురించడానికి రంగంసిద్ధమైందట, ఈ కథనాలు తన తలరాతను, పార్టీ భవిష్యత్ ను మార్చేవిగా ఉన్నాయని ఉప్పందుకున్న జగన్మోహన్ రెడ్డి...అవి రాకుండా చేసుకునేందుకే రామోజీని కలిశారని విశ్వసనీయ సమాచారం. వాటిలో ఒకటి పార్టీకి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ స్టోరీ కూడా ఉందట, ‘వైసీపీ చాప చుట్టేయబోతుందా‘ అనే పేరుతో ప్రచురించడానికి రెడీ అయిన ఆ ఆర్టికల్ ప్రకారం 40మందికి పైగా ఎమ్మెల్యేలు
తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్లతో సహా రాసుకొచ్చిందట, ఇలాంటి కథనం ఈనాడులో వస్తే పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో ఊహించిన జగన్ ...హడావిడిగా రామోజీని కలిశారని టాక్. గతంలో వైసీపీని బీజేపీలో విలీనం చేస్తారంటూ వచ్చిన కథనం లాంటిదని సమాచారం.
గతంలో ‘జెండా పీకేస్తారు‘ అంటూ చిరంజీవి ప్రజారాజ్యంపై ఈనాడులో వచ్చిన కథనం ఎంత సంచలనం అయ్యిందో, ఆ తర్వాత పీఆర్పీ... కాంగ్రెస్ లో ఏవిధంగా విలీనమైందో తెలిసిన జగన్, అలాంటి కథనాలు రాకుండా చూసుకోవడం కోసమే రామోజీ కాళ్ల దగ్గరకు వెళ్లాడని అంటున్నారు.