సిస్ట‌ర్… నీకు వందనం..

నాణ్యత తో కూడిన వైద్యం అందించడం లో కీలక పాత్ర నర్సులదే...

నర్సుల సేవలు నిరుపమానం...

ప్రపంచ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా ప్రతీఏటా లేడీ ఆఫ్  నైటింగేల్  జన్మ దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్త్గంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఆయుద్ధం లో కొనఊపిరి తో కొట్టు మిట్టడుతున్న వారికి సైనికుల కు వైద్య సేవలు అందిస్తూ వైద్యరంగం లో నర్సింగ్ చేయడానికి కొన్ని సందర్భాలలో కులం, మతం, బీద, ధనిక అన్న బేదం లేదు.  కేవలం అస్వస్థత తో ఉన్నవారికి స్వస్థత చేకుర్చాలి అన్నదే లక్ష్యం గా నర్సింగ్ లక్ష్యం. అడిసగా లేడీ అఫ్ డి నైటింగెయిల్ గా ఆమె సేవలు నేటికి చిరస్మరణీయంగా స్ఫూర్తి దాయకంగా నాణ్యతతో కూడిన వైద్యం అందించడంలో నర్సులదే కీలక పాత్ర.

ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం, గుర్తిం చాల్సిన అంశం ఏమిటి అంటే కోవిడ్19 తరువాత భవిష్యతు లో ఎలా ఉండాలో ఎలా ఉండాల్సి వస్తుందో అప్రమత్తం చేసింది. మనకు ఎన్నో గుణపాటాలు నేర్పింది.ఆరోగ్య విధానం లో మార్పులు తచ్చింది. నర్సింగ్ వృత్తికి గుర్తింపు స్వయం కృషితో ఎదిగేందుకు 2౦22 ఆరోగ్య సంరక్షణ పై దృష్టి పెట్టాల్సిన అవసరం వివరించింది. 2౦22 ప్రపంచ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా  ముందుకు నడవాలంటే మీ స్వరాన్ని వినిపించేందుకు నర్సులు ముందుకు రావాలి ఎందుకంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా కోవిడ్ సమయంలో వారు అందించ్గిన సేవలు నిరుపమానం శ్లాఘనీయం.ఆ సేవలు ఎన్నటికీ వెలకట్ట లేనివి.

భయంకరమైన కోవిడ్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ మిలియన్ల ప్రజల ప్రాణాలుజీవితాలను రక్షించి ప్రాణాలు కాపాడెం దుకు సవాళ్ళను ఎదుర్కుంటూనే తమ కుటుంబాల సైతం ఫణం గా పెట్టి  సరైన సమయం లో మందులు అందిస్తూ రోగులు త్వరగా కోలుకోవడం లో కీలక పాత్ర పోషించేది మేడికల్ మ్యానేజ్ మెంట్ కీలకం.ముఖ్యంగా కోరోనా సమయం లో ఎన్నోసవాళ్ళను అధిగమిస్తూ ఎదురొడ్డి పోరాడిన నర్సులుఅందరికీ తెలుగు వన్ హెల్త్ సెల్యూట్ చేస్తుంది. కోరోనా చికిత్స అనంతరం కూడా కేంద్రం అందించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం గా పూర్తి చేయడం లో నర్సులదే కీలక భూమిక పోషించారు.ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతం లో సైతం వ్యాక్సిన్ అందించడం లో కీలక పాత్ర పోషించింది నర్సులే. ప్యాండమిక్ సమయం లో సరైన వైద్యం సరైన మందు అందించినప్పటికీ ఆయాదేశాలలో నర్సుల కొరత తీవ్రంగా ఉంది.అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.2౦ 24 నాటికి     భారత  దేశం లో 4౩౦ మిలియన్లకు  పైగా నర్సులు అవసరమని ముఖ్యంగా  రానున్నరోజుల్లో ప్రజా ఆరోగ్యం పై సవాళ్ళను ఎదుర్కునేందుకు అవసరమని ప్రత్యేక మైన సవాళ్ళు ఎదురయ్యే నేపధ్యం లో నాణ్యత తో కూడిన వైద్య సేవలు అందించడం అవసరం ఎదురయ్యే రోగాలనుండి రోగులను సంరక్షించడం అవసరం.

నర్సింగ్ సమస్యలు...

కోవిడ్ వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తోంది.కోవిడ్ సమయంలో కోవిడ్ రోగులకు కొన్ని మందులు ఇచ్చే సమయం లో అమ్మిన మందులు అందులో కొన్ని మందులు నాణ్యత లేకపోవడం ఉదాహరణకు రేమిడి సివిర్,మాలో పెరవిర్ వంటి మందులు సైతం అత్యవసర సమయం లో పనికి వస్తాయంటూ అందులోనూ డూప్లికేట్ మందులు లక్షల రూపాయలకు అమ్ముకున్నారు ఈ అంశాలను సైతం నర్సింగ్ చేసే నర్సులు గమనించాలి.నర్సింగ్ విధానాన్ని పూర్తి స్వేచ్చగా వ్యవహరించే వెసులు బాటును కల్పించాలి.ఆరోగ్య సంరక్షణ సవాళ్ళను ఎదుర్కోవాలంటే నిర్మాణాత్మక మార్పులు ప్రవేసపెట్టాలని నాణ్యతతో కూడిన వైద్యం అందించడం లో నర్సులదే కీలక పాత్ర నర్సింగ్ సేవలు అందించే వారికి ప్రోత్సాహకాలు విలువైన నాణ్యతతో కూడిన మందుల పంపిణీ అవసరం. ఒక్క పురుగు మొత్తం పంటను నాశనం చేసినట్లు ఒకసారి వైద్యరంగం లో మెరుగైన సేవలు అందించకుంటే  అసేవకు విలువ ఉండదు.