కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం తేదీ మార్పు
posted on Dec 17, 2025 2:12PM

తెలంగాణలో కొత్త సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మారింది. ముందుగా నిర్ణయించిన 20న కాకుండా 22 తేదీకి అపాయింట్‌మెంట్ డేను మారుస్తూ పంచాయితీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20న అమావాస్య కావున 22కు వాయిదా వేయాలని ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన సర్పంచులందరూ 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.
దీంతో నూతన సర్పంచుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీ రాజ్ శాఖ, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని రెండు రోజులు వెనక్కి జరిపి డిసెంబర్ 22న నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అదే రోజున నూతన సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, నూతన పాలకవర్గాలతో ప్రమాణస్వీకారం చేయించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు, పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.