Top Stories

వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు

  వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ  హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే ఆయనకు వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. తన హెల్త్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వంశీకి తక్షణమే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. కాగా అక్రమ మైనింగ్ కేసులో కూడా వంశీకి నేడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్ట్. అదే విధంగా వంశీ తనకు మెరుగైన చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రి లో సరైన సౌకర్యాలు లేవని కోర్టుకు నివేదించారు. దీంతో, వంశీకి మెరుగైన చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  
వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు Publish Date: May 29, 2025 8:50PM

ఈ పెద్దాయన మహా అభిమాని.. 400 కిలోమీటర్లు సైకిల్‌పై మహానాడుకు

  ఈ పెద్దాయన తెలుగుదేశం పార్టీకి మహా అభిమాని 400 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేస్తూ కడపలో జరిగిన మహానాడుకు హాజరయ్యారు. మండే ఎండలు మధ్య మధ్యలో వానలు అయినా లెక్క చేయకుండా ఏడు పదులు దాటిన వయసులో 400 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలంటే సాహసమే..అయినా అభిమానం ముందు ఆ సాహసం ఆయనకు పెద్ద లెక్కే కాకుండా పోయింది. ధూళిపూడి మునేశ్వరరావు అనే  ఈ పెద్దాయనది అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు.  తెలుగుదేశం పార్టీ అంటే వల్లమాలిన అభిమానం కడపలో జరుగుతున్న మహా పండుగ కు తమ తెలుగుదేశం పార్టీ గుర్తు,పేదోడి రధం అయిన సైకిల్ పై వచ్చారు. ఈయనకు టిడిపి అంటే వీరాభిమానం 400 కిలోమీటర్లు సైకిల్ పై వచ్చిన ఈ పెద్దాయన గురించి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు ఆయన్ను వేదికపై కి పిలిచి అందరికీ చూపిస్తూ స్ఫూర్తి దాత అంటూ కితాబిచ్చి అభినందించారు. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి కార్యకర్తలు ఉండం పూర్వజన్మ సుకృతం అని చంద్రబాబు కొనియాడారు. వేదికపై ఉన్న నారా లోకేష్ సైతం లేచి చప్పట్లు కొడుతూ అభినందించారు  
ఈ పెద్దాయన మహా అభిమాని.. 400 కిలోమీటర్లు సైకిల్‌పై  మహానాడుకు Publish Date: May 29, 2025 8:36PM

మహానాడు సభలో ఎమ్మెల్యే భర్త తీవ్ర భావోద్వేగం .. ఓదార్చిన సీఎం చంద్రబాబు

  కడపలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు మూడో రోజు భారీ బహిరంగ సభతో విజయవంతంగా ముగిసింది. ఈ సభ వేదికపై ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వేదికపైకి చేరుకున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏర్పాట్లను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెడ్డెప్పగారి శ్రీనివాస్‌ రెడ్డిని భుజం తట్టి సీఎం మెచ్చుకున్నారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి ఆనందభాష్పాలతో చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.  గత ఐదేళ్లలో కడప జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఆయన పడి కష్టం.. ప్రత్యర్థుల కుట్ర, చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను గుర్తు తలచుకోని శ్రీనివాస్‌ రెడ్డిని ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఆయనను చంద్రబాబు నాయుడు ఓదార్చారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడిన మాధవీ రెడ్డి దంపతులను అభినందించారు. ఈ సందర్బంగా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట్లాడుతు  తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.కడప ఎమ్మెల్యే సీటు ఒక మహిళకు కేటాయించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.  
మహానాడు సభలో ఎమ్మెల్యే భర్త తీవ్ర భావోద్వేగం .. ఓదార్చిన సీఎం చంద్రబాబు Publish Date: May 29, 2025 7:58PM

కడప గడ్డన ముగిసిన మహా సంబరం

  రాయలసీమ నడిబొడ్డు కడప గడ్డన నిర్వహించిన పసుపు పండగ పసుపు దండు ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. ఉత్తంగ తరంగమై అన్ని దారులు కడప వైపు అన్నట్టు పెను ప్రవాహంలో తెలుగుదేశం శ్రేణులు మహానాడుకు తరలి వచ్చి జోష్ నింపారు .ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా నేతలు ,కార్యకర్తలు అభిమానులు రావడంతో కడప ఈ మూడు రోజులు మినీ సమైక్యాంధ్ర ను తలపించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ,జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుల ప్రసంగాలు ఆకట్టు కొనడమే కాదు పార్టీ కార్యకర్తలకు అత్యంత ప్రధాన్యం ఇస్తూ మాట్లాడం వారిలో  మరింత భరోసా నింపింది .అందరి నాయకులకు వేదికపై మాట్లాడే అవకాశం కల్పించడంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తల కరతాళధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. *కడప వేదికగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక  ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలుగుదేశం పార్టీ జరుపుకునే మహానాడు ఈసారి కడపలో నిర్వహించడంతో మరోసారి చంద్రబాబు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక కావడానికి కడప వేదికైంది .ఆ హోదాలో చంద్రబాబు నాయుడు ప్రసంగించి తెలుగు తమ్ముళ్లు కార్యకర్తలకు సేవలకు జోష్ నింపారు .మీకు నేనున్నాను పార్టీ ఉంది మనం కష్టపడదాం ప్రజలకు మంచి చేద్దాం అంటూ పార్టీ శ్రేణులకు స్థైర్యాన్ని ఇచ్చారు. *కలివిడిగా లోకేష్  రాష్ట్ర సాంకేతిక ,విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహానాడులో కలివిడిగా తిరుగుతూ అందరితో మాట్లాడుతూ సీనియర్ నాయకులను గౌరవిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించారు. ఎక్కడ తారతమ్య భేదాలు ప్రదర్శించకుండా అవకాశం దొరికిన మేరకు అందరితో  ముచ్చటిస్తూ వచ్చారు. మీడియా పాయింట్ లో సైతం అయన మాట్లాడేందుకు వేదికపై కూర్చుంటారని జర్నలిస్టు భావించారు. అయితే ఆయన నేరుగా వచ్చి వేదిక మీదే కుర్చీలో కాకుండా ఒక వారన క్రింద కూర్చొని అందరితో కలిసి మాట్లాడుతూ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చారు. ఎక్కడా విసిగించుకోకుండా ప్రశ్నించిన ప్రతి వారితో నవ్వుతూ మాట్లాడుతూ సమాధానం ఇవ్వడం ఆయన పరిణితికి నిదర్శనంగా చెప్పవచ్చు. *ప్రత్యేక ఆకర్షణగా యన్టీఆర్ గ్యాలరీ. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీ మహానాడుకు వచ్చిన వారిని బాగా ఆకర్షించింది .మొదటి రెండు రోజుల్లో ప్రతిధుల మహాసభకు దక్షిణం వైపు ఏర్పాటుచేసిన ఈ గ్యాలరీలో ఒక భాగం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటివి పాత చిత్రాలు రంగుల్లోనూ బ్లాక్ అండ్ వైట్ లోను ప్రదర్శించడం చూసేవారికి ఆసక్తి కలిగించింది .ఎన్టీఆర్ గారి తో పాటు దాని పక్కన చంద్రబాబు ,లోకేష్ ఫోటో గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే మహానాడు చివరి రోజున గురువారం ఆ గ్యాలరీ లో ఫోటోలు తీసివేయడంతో లక్షల సంఖ్యలో వచ్చిన వారు వాటిని వీక్షించలేకపోయారు. *అనుకూలించిన వాతావరణం మహానాడు మరో నాలుగు రోజుల్లో మొదలవుతుందన్న ప్పట్నుంచి వర్ష వస్తుందేమో అన్న ఆందోళన కలిగిస్తూనే వస్తోంది .మహానాడు మొదలయ్యే ముందు రోజు కూడా వర్షం కురవడంతో నిర్వాహకుల్లో ఆందోళన తప్పలేదు. ముందు జాగ్రత్త చర్యగా ప్రాంగణంలో వేదికల టెంట్ ల చుట్టూ ముందు జాగ్రత్త చర్యగా కాలువలు తవ్వించారు . 27 నుంచి మూడు రోజులపాటు మహానాడు ముగిసే‌వరకు వర్షాలు రాకపోగా వాతావరణం కూడా చల్లబడడంతో మహానాడు మరింత విజయవంతం కావడానికి కారణం అయ్యింది . టిడిపి నాయకులు కూడా ఊపిరి పిల్చుకున్నారు. *సీమగడ్డన వరాల జల్లు  కడపలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు జరుగుతుందంటే కడప తో పాటు రాయలసీమ వాసులు ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం ఏవైనా హామీలు ఇస్తారని భావించడం సహజమే.. అయితే అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమతో పాటు రాష్ట్రంలో చేపట బోయే అభివృద్ధి పనులను మహానాడు వేదికగా  ప్రకటించారు. రాయలసీమ విషయానికొస్తే రాయలసీమను సుభిక్షం చేసేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని సీమను కరువు సీమగా ,ఎడారి సీమ గా కానివ్వమని భరోసా ఇచ్చారు. తెలుగు గంగా, హంద్రీ నీవా-నీవా, గాలేరు -నగరి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని ఆ తర్వాత తాను బాధ్యతలు చేపట్టాక వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు .సీమ ప్రాజెక్టులకు 3500 కోట్లు కట్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది పోలవరం తర్వాత ఎక్కువ స్టైల్ నిధులు కట్ చేసిన ప్రాజెక్టు పందిరి అని అన్నారు 2027 నాటికి జాతికి అంకితం చేస్తామని పోలవరంపై స్పష్టత ఇవ్వడం జరిగింది. వంశధార నుంచి పెన్నా వరకు నదులు అనుసంధానం చేయాలన్నది తమ లక్ష్యం అని తన సంకల్పాన్ని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధిని అగ్రభాగంలోని బాధ్యత తమదే అని హామీ ఇవ్వడం జరిగింది. *ఉక్కుకు మోసులు కడుపుతో పాటు  రాయలసీవాసులు ఎప్పుడెఎప్పుడా  అని ఎదురుచూస్తున్న ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వడం ఈ ప్రాంత వాసుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.దాదా20ఏళ్ళు గా 20 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ఉక్కు సంకల్పానికి పునాదిరాళ్లు తప్ప పూర్తి  చేసిన పరిస్థితులు లేవు. అయితే ముఖ్యమంత్రి మహానాడులో 10 రోజుల్లో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తామని రెండు దశల్లో రూ,9,000 కోట్లతో రాయలసీమ స్టీల్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తితో నిర్మాణం చేపడతామని ప్రకటించారు. జిందాల్ సంస్థ నిర్మించే ఈ స్టీల్ ప్లాంట్ లో  3,000 మందికి ఉద్యోగాలు వస్తాయని,ఈ ప్లాంట్ కు శంకుస్థాపనతో పాటు నేనే ప్రారంభోత్సవం చేస్తారని చెప్పడం పై ఇక్కడి వాసుల్లో నమ్మకం కుదురుతోంది. పర్యాటపరంగా గండికోటను అభివృద్ధి చేస్తామని, అక్కడ శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని భవిష్యత్తులో అంతా టూరిజమే‌అని చెబుతూ గండికోట అభివృద్ధి చేయడంతో పాటు శ్రీశైలం,తిరుపతి క్షేత్రాలను మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు .మహానాడు కడపలో పెట్టిన నేపథ్యంలో ఇలాంటి హామీలు ఇవ్వడం సీమవాసుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది
కడప గడ్డన ముగిసిన మహా సంబరం Publish Date: May 29, 2025 7:36PM

మహానాడు గ్రాండ్ సక్సెస్.. ఇక కడప జిల్లా టీడీపీకి అడ్డా : సీఎం చంద్రబాబు

  కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప టీడీపీ మహానాడుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఎన్నోసార్లు కడపకు వచ్చానని.. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలామంది అనుమానించారని సీఎం అన్నారు. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అని నిరూపించేందుకే మహానాడు ఇక్కడ పెట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడపలో జరిగిందని.. రెస్పాన్స్ అదిరిందన్నారు. మహానాడు సూపర్ హిట్ అయ్యిందని అన్నారు. కడప రాజకీయం మారబోతోందని.. కడప గడపలో మార్పు కనిపిస్తుందని గత ఎన్నికల ప్రచారంలో చెప్పానన్నారు. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని  కొనియాడారు.  ఈ ఎన్నికల్లో కడపతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన విజయం సాధించామన్నారు. ఉమ్మడి కడపలో పదికి ఏడు స్థానాలు గెలిచామని చెప్పుకొచ్చారు. ఇప్పటి నుంచి కష్టపడితే 2029 ఎన్నికల్లో పదికి పదికి స్థానాలు గెలుచుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.  జూన్‌ 12 నాటికి 500 సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. వాట్సప్‌లో హాయ్‌ అని పెడితే పనులు జరుగుతాయి. 2027 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. దేశానికి ఉగ్రవాదుల వల్ల చాలా నష్టం. రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం. ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాం. రాజకీయాల ముసుగులో ల్యాండ్‌, శాండ్‌, మైన్స్‌ దోచేశారు.  డ్రగ్స్‌, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నా. ఆడబిడ్డల జోలికి వస్తే అవే వారికి అంతిమ గడియలు. గత పాలనలో భూతానికి పరిశ్రమలు వెనకడుగు వేశామన్నారు. భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నామని హామీ ఇచ్చా. రాష్ట్రాన్ని గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాది. రాయల సీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తాం. రాయలసీమ అభివృద్ధికి బ్లూప్రింట్‌ ఉంది. ఆరు నెలల్లో కడప హజ్‌హౌస్‌ పూర్తి చేస్తాం. కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ తప్పకుండా వస్తుంది. జూన్‌ 12లోగా కడపలో రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తాం’’ అని సీఎం ప్రకటించారు. ప్రజలకు డబ్బులతో పాటు ఆరోగ్యం ఉంటేనే నిజమైన అభివృద్ధిని తెలిపారు.
మహానాడు గ్రాండ్ సక్సెస్.. ఇక కడప జిల్లా టీడీపీకి అడ్డా : సీఎం చంద్రబాబు Publish Date: May 29, 2025 7:14PM

ఒక పుష్ప‌ నేష‌న‌ల్, స్టేట్ అవార్డులు రెండు..కార‌ణాలేంటి?

  పుష్ప పార్ట్ వ‌న్ ద్వారా నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రాగా.. పార్ట్ టూ ద్వారా.. స్టేట్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రావ‌డం మాములు విష‌యం కాదు. ఒక పాత్ర‌ను ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు మ‌ల‌చ‌డం ఒక ఎత్తు అయితే దాన్ని చేయ‌డం మ‌రొక ఎత్తుగా భావించాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ ద‌ర్శ‌క ర‌చ‌యిత‌ల‌దా? లేక ఆ కేరెక్ట‌ర్ కి ప్రాణం పెట్టిన ఆర్టిస్టుదా? ఎవ‌రి స‌మ‌ర్ధ‌త ఎంతెంత‌? ఎవ‌రికి ఈ ఘ‌న‌త‌ను ఇవ్వాల్సి ఉంటుంద‌ని చూస్తే.. ఒక ర‌కంగా చెబితే ఆర్టిస్టుకే ఈ క్రెడిబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది.కార‌ణం.. పాత్ర‌లు అన్నింటా ఉంటాయి. అంద‌ర‌కూ క్రియేట్ చేయ‌గ‌ల‌రు. కానీ దాన్ని పాన్ ఇండియాలో ప్రేక్షక ప్ర‌జ‌లను అల‌రించ‌డం.. ఒక ర‌క‌మైన మేన‌రిజమ్స్ తో ఆక‌ట్టుకోవ‌డం.. ఇవ‌న్నీ ఆర్టిస్టు చేతుల్లోనే ఉంటాయి. పుష్ప  2 పాత్ర అయితే, ఏకంగా డైలాగ్ డెలివ‌రీ కూడా స‌రిగా ఉండ‌దు. నోట్లు తంబాకు పెట్టుకుని న‌త్తి న‌త్తిగా డైలాగ్ చెప్ప‌డం అన్న‌ది ఇందులో క‌నిపిస్తుంది. దీంతో .. ఈ పాత్రను మ‌రింత క‌ష్ట‌త‌రం చేశారు ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు. దీంతో చెప్పేదేముందీ ఈ పాత్ర పోష‌ణ మ‌రింత క‌ఠువుగా మారినా.. దాన్నికూడా ఒక ఛాలెంజింగా తీసుకున్న న‌టుడు అల్లు అర్జున్ దీన్ని భేష్ అనిపించాడు. ఇక్క‌డ మ‌రో స‌బ్జెక్ట్ ఏంటంటే.. ఇలాంటి స్మ‌గ్ల‌ర్ కేరెక్ట‌ర్స్ కి, గ‌ద్ద‌ర్ లాంటి  ప్ర‌జా వాగ్గేయ‌కారుడు, విప్ల‌వ‌కారుడి పేరిట ఇవ్వ‌డ‌మేంటి? ఇక్క‌డ‌స‌బ్జెక్ట్ గ‌ద్ద‌ర్ కీ ఆ పాత్ర‌కీ  ఉన్న పోలిక కాదు. అంత‌టి క‌ష్ట‌త‌ర‌మైన పాత్ర‌ను ఒక న‌టుడిగా అత‌డెలా చేశాడు? అన్న‌దే కీల‌కం. దీంతో ఈ దృష్టికోణంలో మ‌నం అలా చూడాల్సి ఉంటుంద‌ని చెప్పాలి
ఒక పుష్ప‌ నేష‌న‌ల్, స్టేట్ అవార్డులు రెండు..కార‌ణాలేంటి? Publish Date: May 29, 2025 6:20PM

ముఖ్యమంత్రి రేవంత్ కు కోపమొచ్చింది.. ఎందుకో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత, ఆయనలో మార్పు వచ్చిందా?  గతానికి భిన్నంగా.. ముఖ్యంగా అధికారుల విషయంలో కొంత కఠినంగా, ఖచ్చితంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారా?  అధికారులపై, కల్లెక్టర్లపై కోపంగా ఉన్నారా?  అలాగే.. మంత్రులకు మంరిత దగ్గరయ్యే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారా? అంటే ఇటు అధికార వర్గాల నుంచి, అటు రాజకీయ వర్గాల నుంచి కూడా ఔననే సమాధానమే వస్తోంది.  ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి.. మంగళవారం(మే28)  జిల్లా కల్లెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. అఫ్కోర్స్  రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలతో పాటుగా.. ఇంచార్జి మంత్రుల జిల్లా పర్యటనలు, జూన్ 3వ తీదీ నుంచి 20వ వరకు జరగనున్న భూభారతి రెవెన్యూ సదస్సులు, ధాన్యం సేకరణ, తదితర అంశాలపై చర్చించేందుకే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉండవచ్చును. అయితే.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన చేసిన వ్యాఖ్యలు  కొంత భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. ఈసందర్భంగా జిల్లా కల్లెక్టర్లు కార్యాలయాలకు పరిమితం అయితే కుదరదని ముఖ్యమంత్రి కరాఖండిగా  చెప్పారు. మంత్రులు జిల్లా కల్లెక్టర్లు క్షేత్ర  స్థాయిలో పర్యటించి, ధాన్యం సేకరణ, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఖరీఫ్ సీజన్  వ్యసాయ కర్యకాలపాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.  జిల్లాల ఇంచార్జి మంత్రులు మే 29, 30 తేదీల్లో జిల్లాలో పర్యటించి ధాన్యం సేకరణ, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు,ఖ రీఫ్ సీజన్ వ్యవసాయ కర్యకాలపాల అమలు తీరును సమీక్షించి..  నివేదికను జూన్ 1 వ తేదీ, సాయంత్రం 4 గంటల లోపు  సీఎంవోకు అందచేయాలని ఆదేశించారు.   అంతే అయితే, అదో రకం కానీ..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతటితో ఆగలేదు. జిల్లా కల్లెక్టర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా కల్లెక్టర్లు  క్షేత్ర స్థాయి  పర్యటనలు చేసి తీరాలని లేదంటే, ప్రత్యామ్నాయం చూసుకోవలసి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. అంతే కాదు.. ఇక పై ప్రమోషన్లు, పోస్టింగులకు  క్షేత్ర స్థాయి పని తీరు ప్రధాన కొలమానంగా ఉంటుందని స్పష్టం చేశారు.   అంతే కాదు.. జిల్లా కల్లెక్టర్లు ఎవరికైనా క్షేత్ర స్థాయి పర్యటనలకు ఏ కారణంగా అయినా.. ఎలాంటి ఇబ్బంది,అభ్యంతరం ఉన్నా,  వారి స్థానంలో ప్రత్యామ్నాయం చూసుకుంటామని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  మాట వినక పోతే సహించేది లేదని కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు. అలాగే..  ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీడియా, సోషల్ మీడియా చేస్తున్నతప్పుడు ప్రచారం విషయంలో కల్లెక్టర్లు మౌనంగా ఉండడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన  ముఖ్యమంత్రి,  కల్లెక్టర్లు వాస్తవాలను చెప్పకపోవడం వలన తప్పుడు ప్రచారాన్ని  ప్రజలు నిజమని నమ్మే పరిస్థితి వస్తోందని అన్నారు. అధికారులు, ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడంలో క్రియాశీలంగా ఉండాలని, వాస్తవ సమాచారం ఇచ్చిన తర్వాత కూడా తప్పుడు ప్రచారం కొనసాగితే.. అందుకు బాధ్యులైన వారిపై పోలీసు కేసులు పెట్టాలని మఖ్యమంత్రి   ఆదేశించారు.  ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోక పోవడం వలన, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, జిల్లా కల్లెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనల వలన వాస్తవ విషయాలు బయటకు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి, కల్లెక్టర్లు సహా అధికారుల పనితీరు పట్ల సంతృప్తిగా లేరనే విషయం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైందని అంటున్నారు. అదలా ఉంటే ముఖ్యమంత్రి అసంతృప్తికి, ఆయన మూడు రోజులఢిల్లీ పర్యటనకు  ఏదైనా సంబంధం ఉందా..  కొన్ని పత్రికల్లో వచ్చినట్లు ప్రభుత్వ పనితీరు పట్ల పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్త చేసిననేపథ్యంలోనే ముఖ్యమంత్రి  అత్త మీది కోపాన్ని దుత్త మీద చూపినట్లు అన్న చందాన అధికారుల మీద చూపించారా  అనే  కొత్త చర్చ మొదలైంది. అలాగే.. ముఖ్యమంత్రి, మంత్రులకు మధ్య  సయోధ్య సరిగా లేదని వస్తున్న కధనాలకు సమాధానంగానే..  ముఖ్యమంత్రి తమ నివాసంలో విందు ఇచ్చారా ? అనే ప్రశ్న కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.  
ముఖ్యమంత్రి రేవంత్ కు కోపమొచ్చింది.. ఎందుకో తెలుసా? Publish Date: May 29, 2025 6:02PM

నేను సుద్ద పూసను.. వాలంటీర్లే విలన్లు.. పోలీసుల విచారణలో సజ్జల భార్గవ్ రెడ్డి

అధికారం అండ చూసుకుని సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిగా చెలరేగిపోయిన సజ్జల భార్గవ్ రెడ్డి సన్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు పోలీసుల విచారణలో మాత్రం  . తాను సుద్దపూసననీ, తనకే పాపం తెలియదనీ చెప్పుకొచ్చారు. అసలైన విలన్స్ వేరు ఉన్నారంటూ తాను తప్పించుకోవడానికి నెపం వాలంటీర్ల మీద నెట్టేయడానికి శతధా ప్రయత్నించారు. అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు అన్న సామెతలా సజ్జల భార్గవ్ రెడ్డి తీరు ఉందని పరిశీలకులు అంటున్నారు.  సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ్ రెడ్డి పీకల్లోతు కూరుకుపోయారు. ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టు వరకూ కూడా వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఇప్పుడీ కేసు నుంచి బయటపడటానికి నెపం వాలంటీర్ల మీద నెట్టేస్తున్నారు. తాను సుద్దపూసననీ వాలంటీర్లే అసలు విలన్లను చెబుతున్నారు. మంగళగిరి పోలీసులు సజ్జల భార్గవ్ రెడ్డిని నిన్న రెండున్నర గంటల పాటు  విచారించారు.  ఆ సందర్భంగా పోలీసుల ప్రశ్నలకు సజ్జల వద్ద సమాధానమే లేకుండా పోయింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులకూ తనకూ అసలు సంబంధమేలేదనీ, అంతా వాలంటీర్లే చేశారని చెప్పారు. అయితే ఆ పోస్టులు మీ పేరు మీద ఎలా షేర్ అయ్యాయన్న పోలీసుల ప్రశ్నలకు సజ్జల వద్ద సమాధానమే లేదు.   విచారణ సందర్భంగా సజ్జలను ఆయన వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా ఉన్న సమయంలో ఉపయోగించిన లాప్ టాప్, మొబైల్ ఫోన్ ఇవ్వమని అడిగితే నిరాకరించారు. విచారణ సందర్భంగా సజ్జలను పోలీసులు 22 ప్రశ్నలు అడిగారు. వాటిలో వేటికీ ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు తన పని కాదనీ, అదంతా వాలంటీర్లు చేశారనీ పదేపదే చెప్పినట్లు తెలిసింది.  మరి వాలంటీర్లను ఎందుకు నియంత్రించలేదంటే మాత్రం సరైన సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. ఉదయం పది గంటల నుంచి పన్నెండుర గంటల వరకూ దాదాపు రెండున్నర గంటల విచారణ అనంతరం సజ్జలను మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపేశారు.   విచారణ అనంతరం విచారణాధికారి అవసరమేతే మళ్లీ సజ్జలకు సమన్లు జారీ చేసి విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు.  పర్వత  చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణలపై సజ్జల భార్గవ్ రెడ్డి, పర్వత సుధాకర్ రెడ్డిలు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారన్న రాజేష్ బాబు అనే వ్యక్తి ఆధారాలతో సహా చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్ల తెలిపిన సీఐ ఆయనకు మరో సారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు. ముందస్తు బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డి  విచారణకు సహకరించకుంటే  అరెస్టయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 
నేను సుద్ద పూసను.. వాలంటీర్లే విలన్లు.. పోలీసుల విచారణలో సజ్జల భార్గవ్ రెడ్డి Publish Date: May 29, 2025 5:38PM

మహానాడు వేదికపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ అస్వస్థత

  కడప మహానాడు బహిరంగ సభా వేదికపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ స్పృహ తప్పిపడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న జలీల్ ఖాన్‌ను హుటాహుటిన ఆసుపత్రికి టీడీపీ శ్రేణులు తరలించారు.  2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు జలీల్ ఖాన్. బీజేపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది అధికారంలోకి వచ్చింది. దీంతో జలీల్ ఖాన్‌తో పాటుగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు.. అప్పట్లో టీడీపీలో చేరిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జలీల్‌ ఖాన్ స్థానంలో ఆయన కూతురు టీడీపీ తరుఫున పోటీ చేశారు. అయితే వైసీపీ తరుఫున పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్.. నాటి ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ విపక్షంలో ఉండిపోయారు జలీల్ ఖాన్. ఇక 2024 ఎన్నికల్లో జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున టికెట్ ఆశించారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి దక్కింది. 
మహానాడు వేదికపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ అస్వస్థత Publish Date: May 29, 2025 5:03PM

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..కీలక నేత హిడ్మా అరెస్ట్

  మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా, కోరాపూట్ అడవుల్లో భద్రతా బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిడ్మా ప్రస్తుతం మావోయిస్టు ఏరియా కమీటీ సభ్యుడిగా ఉన్నారు. అయితే.. మావోయిస్టులకు వరుసగా భారీ షాక్‌లు తగులుతున్నాయి.  ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు  అలియాస్‌ బసవరాజు మృతి చెందారు. ఆయనతో పాటు మరో 27 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు స్వయంగా కేంద్ర హోంశాఖ అధికారికంగా ధ్రువీకరించింది. ఇది జరిగిన వారం రోజులకే కీలక నేత హిడ్మా పోలీసులకు చిక్కడం హాట్ టాపిక్‌గా మారింది. 
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..కీలక నేత హిడ్మా అరెస్ట్ Publish Date: May 29, 2025 4:47PM

పాక్‌లో సన్నీయాదవ్‌ బైక్ రైడ్..రంగంలోకి ఎన్‌ఐఏ

  యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్‌ను చెన్నై ఎయిర్పోర్టులో ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్‌‌‌‌లో బైక్ రైడ్ చేశారు. పాక్ టూర్ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌‌‌లోడ్ చేశాడు. అయితే, ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు టూర్ ముగించుకుని స్వదేశానికి వచ్చిన భయ్యా సన్నీ యాదవ్‌ను ఇవాళ చెన్నై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ అధికారుల సమాచారంతో తెలంగాణ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ స్వగ్రామైన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులను సైతం విచారించినట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఇవాళ ఎన్ఐఏ అధికారులు సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.  మరోవైపు భయ్యా సన్నీయాదవ్ రెండు నెలలు పాకిస్థాన్‌లో ఏం చేశాడు? అక్కడ ఆయనకు షల్టర్ ఇచ్చింది ఎవరు? పాకిస్థాన్‌లో ఎవరెవరిని కలిశాడు? అసలు అన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆపరేషన్ సిందూర్ జరుతుగుతున్న సమయంలోనే అక్కడి వీడియోలను ఎందుకు అప్ లోడ్ చేశాడు? అనే విషయాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేసున్నాట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ పాకిస్థాన్‌లో రెండు నెలల దిన చర్యపై కూపీలాగుతున్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. పాక్ పర్యాటనపై విమర్శలు రావడంతో  సన్నీయాదవ్ ఇటీవలనే ఓ వీడియో విడుదల చేశారు. తనపై కొంతమంది తప్పులు వీడియోలు, వార్తలు పోస్ట్ చేస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. మీలాగే తనకు కుటుంబం ఉందని, మమ్ముల్ని బాధపెట్టేవారిపై తాను లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని ఆయన హెచ్చరించాడు  
పాక్‌లో సన్నీయాదవ్‌ బైక్ రైడ్..రంగంలోకి ఎన్‌ఐఏ Publish Date: May 29, 2025 4:19PM

పది రోజుల్లో కడప స్టీల్ పనులు.. ఇక జిల్లాలో జగన్ ను పట్టించుకునేదెవరు?

కడప జిల్లా… ఎలాంటి డౌటూ లేదు.. ఈ జిల్లా జగన్ కు కంచుకోటే. అయితే ఆ కోటకు బీటలు వారాయన్నదీ అంతే నిజం. గత ఏడాది జరిగిన ఎన్నికలలో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడింటిలో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.  అయినంత మాత్రాన కడపలో వైసీపీ గాలిపోయిందన్న నిర్దారణకు రావడం సరి కాదు. వైఎస్ హయాం నుంచీ కూడా ఆ కుటుంబానికి కడప జిల్లా పెట్టని కోట లాంటిది. జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో అన్ని వర్గాలను ఎలా అయితే దూరం చేసుకున్నాడో.. అలాగే కడపనూ దూరం చేసుకునే పరిస్థితికి వచ్చారు. చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా జిల్లాలో తన సొంత నియోజకవర్గమైన పులివెందుల సహా మూడు నియోజకవర్గాలలో పట్టు నిలుపుకోగలిగారు. అటువంటి కడపలో  తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది. అలా నిర్వహించి ఊరుకోలేదు. మహానాడు వేదికగా కడప జిల్లాకు వరాలు కురిపించింది. వాటిల్లో అతి ముఖ్యమైనది కడప స్టీల్ ఫ్యాక్టరీ. పది రోజుల్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు మహానాడు వేదికగాప్రకటించారు. ఇది కడప జిల్లా ప్రజల మూడ్ ను ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం నోటి మాటగా చంద్రబాబు కడప స్టీల్స్ గురించి చెప్పి ఊరుకోలేదు. కడప స్టీల్ ఎన్నాటు చేస్తున్న సంస్థకు ఈ మేరకు డెడ్ లైన్ కూడా విధించారు.   ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తి కానున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 12కు ఏపీలో తెలుగుదేశం కూటమి సర్కార్ అధికారపగ్గాలు అందుకుని ఏడాది అవుతుంది. కూటమి ప్రభుత్వ తొలి వార్షికోత్సవం లోగా కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాల్సిదేనని సంబంధిత కంపెనీకి చంద్రబాబు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ తొలి దశలో 3వేల మందికి ఉపాధి లభిస్తుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో కడప అభివృద్ధి దిశగా పరుగులు పెట్టడం ఖాయమనడంలో సందేహం లేదు. కడప స్టీల్స్ విషయంలో ఐదేళ్ల పాటు ఏం చేయకుండా వైసీపీ చేతులు ముడుచుకుని కూర్చుంది. ఇప్పుడు చంద్రబాబు కూటమి కడప స్టీల్ ప్లాంట్ పనులు పది రోజుల్లో ప్రారంభమౌతాయని ప్రకటించడంతో జిల్లాలో ఇక జనగ్ ను కానీ, జగన్ పార్టీని కానీ పట్టించుకునే నాథుడు ఉండకపోవచ్చని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.
పది రోజుల్లో కడప స్టీల్ పనులు.. ఇక జిల్లాలో జగన్ ను పట్టించుకునేదెవరు? Publish Date: May 29, 2025 3:41PM

ఇక ఏపీలో సండే కూడా రేషన్ షాపులు ఓపెన్

  ఏపీలో రేషన్ సరుకుల పంపిణీ విధానంలో కూటమి సర్కారు లబ్ధిదారులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఆదివారాల్లోనూ రేషన్ దుకాణాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గురువారం నాడు విజయవాడలో రేషన్ షాపు ద్వారా సరుకుల పంపిణీ ట్రయల్ రన్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో రేషన్ వాహనాల కోసం పనులు మానుకుని గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఉండేదని, ఆ ఇబ్బందులను తొలగించడమే కాకుండా, లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.  ప్రజల సౌలభ్యమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని. జూన్ 1 నుంచి 15 రోజుల పాటు రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ పదిహేను రోజుల్లో ఆదివారంతో సహా అన్ని రోజులూ షాపులు తెరిచే ఉంటాయి. దీనివల్ల రోజువారీ పనులకు వెళ్లేవారు, కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు తమకు వీలైన సమయంలో, ముఖ్యంగా సెలవు దినమైన ఆదివారం కూడా రేషన్ తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది" అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఇక ఏపీలో సండే కూడా రేషన్ షాపులు ఓపెన్ Publish Date: May 29, 2025 3:18PM

బీఆర్ఎస్ ను చీల్చడమా?.. కొత్త పార్టీయా.. కవిత అడుగులెటు?

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కవిత హాట్ టాపిక్ గా మారారు. పార్టీ రజతోత్సవ సభ వేదికగా తండ్రి కేసీఆర్ ప్రసంగంలోని లోపాలను ఎత్తి చూపుతే ఆమె రాసిన లేఖ బయటకు వచ్చిన క్షణం నుంచీ తెలంగాణ రాజకీయ చర్చ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతోంది. అంతకు ముందు నుంచీ కూడా ఆమె మాటలు, తీరు బీఆర్ఎస్ లో కలకలం సృష్టిస్తూనే ఉంది. అయితే తాజాగా ఆమె బీఆర్ఎస్, బీజేపీ నెక్సస్ నిజమేనంటూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పునాదులనే కదిపేశాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పోలిటికల్ ఎగ్జిస్టెన్స్ నే ప్రమాదంలో పడేసేంత తీవ్రంగా ఉన్నాయి. వాస్తవానికి సొంత తండ్రి, సోదరుడు లక్ష్యంగా ఆమె సంధించిన విమర్శనాస్త్రాలు, ప్రశ్నాస్త్రాలూ పార్టీ పునాదులనే కదిలించేస్తున్నాయి. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ అస్తిత్వానికే ముప్పుగా పరిణమించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి   బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అన్న ప్రచారం  ఎప్పటి నుంచో బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఈ ఆరోపణ చేస్తూ వస్తోంది.  వాస్తవానికి బీజేపీ విజయం కోసం కవిత ఓటమికి బీఆర్ఎస్ తెరవెనుక రాజకీయం నడిపిందన్న ఆరోపణలు కూడా గట్టిగానే ఉన్నాయి. బీజేపీ గెలుపు కోసమే 2018 లో కవితను సొంత వారే బలిపశువును చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. అప్పట్లో  కవిత ఓటమి కి బిఆర్ఎస్ కు బీజేపీ తో ఉన్న తెరచాటు సంబంధాలే కారణం అనే వాదన కూడా అప్పట్లో గట్టిగానే వినిపించింది.  ఢిల్లీ  మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు.  కవిత అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందన్నది తెలంగాణ రాజకీయాలలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ.. అయితే ఆ సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ సహా పార్టీ ముఖ్య నేతలెవరూ కూడా  బీజేపీ కి వ్యతిరేకంగా ఒక్క ఖండన కూడా చేయలేకపోయారు. ఇక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి అంటూ కేసీఆర్ పై విచారణకు రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించింది. , అలాగే    ఈ ఫార్ములా రేసింగ్ అంటూ కేటీఆర్ పై  కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నా, కేసీఆర్ కుటుంబం అరెస్టుల భయం నుంచి బయటపడాలన్నా బీఆర్ఎస్ కు బీజేపీ సాయం తప్పనిసరి.  ఈ నేపథ్యంలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీఆర్ఎస్ అడుగులు ఆ దిశగానే పడుతున్నాయన్న అనుమానాలూ బలపడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇదే సమయంలో కవిత కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న ప్రచారంపై కూడా ఆమె స్పష్టత ఇచ్చారు. మునిగిపోయే నావ వంటి కాంగ్రెస్ లో చేరే ప్రశక్తే లేదని కవిత కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. దీంతో ఇప్పుడు కవిత పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటన్న చర్చ కూడా జోరందుకుంది. ఆమె కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచనలో ఉన్నారనీ, ఆ పార్టీ పేరు బీఆర్ఎస్, టీఆర్ఎస్ కలబోతగా టీబీఆర్ఎస్ అని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. అదే సమయంలో కవిత సొంత పార్టీ పెట్టే అవకాశాలు లేవన్న వాదనా వినిపిస్తోంది. ఆమె పార్టీలో చీలిక తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక వేళ అదే జరిగితే.. జీహెచ్ఎంసీ పరిధిలో మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కవిత వెంట నడిచే అవకాశాలున్నాయంటున్నారు. అలా కాకుండా ఆమె సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తే.. అప్పుడు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో అత్యధికులు కవిత వెంట నడిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు. అంటే కవిత సొంతంగా కొత్త పార్టీ స్థాపించినా, లేదా పార్టీలోనే చీలిక తీసుకువచ్చినా ఆమె వెంట పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ.  దీంతో ఎలా చూసినా బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకంగానే ఉందంటున్నారు. కేసీఆర్ మౌనం, కేటీఆర్ దుందుడుకు తీరు కారణంగా ఇప్పటికే పార్టీలోని మెజారిటీ నేతలలో  తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుని ఉందంటున్నారు. ఇప్పుడు అలా అసంతృప్తితో ఉన్న వారందరి గొంతుకగా కవిత తన గళమెత్తడం వారంతా కవిత వెంట నడిచే అవకాశలే మెండుగా ఉన్నాయంటున్నారు. 
బీఆర్ఎస్ ను చీల్చడమా?.. కొత్త పార్టీయా.. కవిత అడుగులెటు? Publish Date: May 29, 2025 3:09PM

ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది నిజమే..బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది నిజమే అని పెద్ద ప్యాకేజీ దొరికితే మా పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్‌లో కలిసిపోతారని షాకింగ్ కామెంట్స్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎక్కడ నుంచి పోటీచేయాలో వాళ్లే డిసైడ్  చేస్తారని రాజాసింగ్ అన్నారు. గతంలో కూడా ఇలానే జరిగిందని అన్నారు. దాని వల్లే బీజేపీ భారీగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధానకారణం తమ సొంత పార్టీ నేతలే అని చెప్పారు. సస్పెన్షన్ భయంతోనే పార్టీ క్యాడర్, నేతలు నోరు మూసుకుని కూర్చొంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ మానేతలు కుమ్మక్కుతోనే మా పార్టీ నష్టపోయిందన్నారు. "వాస్తవానికి తెలంగాణలో పార్టీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ, ఇతర పార్టీల నాయకులతో మన సొంత పార్టీ నేతలు కుమ్మక్కు కావడం పార్టీలో కొందరు నాయకులు వారి గెలుపు కోసం స్వార్థంగా కొన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ని గెలుస్తున్నారని ఆయన అన్నారు.  
ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది నిజమే..బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Publish Date: May 29, 2025 2:35PM

మైనింగ్ డాన్ ఎఫెక్ట్.. విచారణ నుంచి తప్పుకున్న ముగ్గురు జడ్జీలు

 మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్ధనరెడ్డి ఎఫెక్ట్ న్యాయవ్యవస్థపై తీవ్ర స్థాయిలో రిఫ్లెక్ట్ అవుతోంది. ఒకే కేసుకు సంబంధించి ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకున్నారు. తెలంగాణ హైకోర్టు చరిత్రలో అలా జరగడం ఇదే మొదటిసారి. దాంతో గాలి అండ్‌ కో బ్యాచ్‌ కేసుల విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఒక కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడం సహజమే. ఆ కేసులో గతంలో హాజరైనా... వ్యక్తిగత కారణం ఉన్నా తప్పుకుంటుంటారు. అయితే ఒకే కేసులో ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకున్న అరుదైన సంఘటనకు తెలంగాణ హైకోర్టు వేదిక అయింది. ఇలా ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు తప్పుకోవడం ఇదే మొదటిసారి. ఓబుళాపురం మైనింగ్‌ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్‌లపై జస్టిస్‌ కె.శరత్, జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకలు విచారణ నుంచి తప్పుకొన్నారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్‌ చేయాలంటూ దోషులు బి.వి.శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, ఓఎంసీ కంపెనీ, మెఫజ్‌అలీఖాన్, వి.డి.రాజగోపాల్‌లు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. దోషులందరూ శిక్షను సస్పెండ్‌ చేసి బెయిలు మంజూరు చేయాలని కోరగా, గాలి జనార్దన్‌రెడ్డి శిక్షను రద్దు చేయాలంటూ అప్పీలు దాఖలు చేశారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు మే 6న వెలువరించిన తీర్పుపై గత వారం దోషులు అప్పీలు దాఖలు చేశారు.  ఈ నెల 21న అప్పీళ్లపై జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఏడేళ్ల లోపు శిక్ష పడి, గతంలో బెయిలు పొందినట్లయితే తక్షణం శిక్ష అమలును నిలిపివేసి బెయిలు మంజూరు చేసే సంప్రదాయం ఉందన్నారు. అందులోనూ మూడున్నరేళ్లకుపైగా జైలు జీవితం గడిపారని, అందువల్ల బెయిలు మంజూరు చేయాలని కోరారు. న్యాయమూర్తి నిరాకరిస్తూ సీబీఐ వివరణ లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేమంటూ విచారణను ఈ వారానికి వాయిదా వేశారు. ఇందులో భాగంగా దోషులు దాఖలు చేసిన 5 పిటిషన్‌లు బుధవారం జస్టిస్‌ కె.శరత్‌ బెంచ్‌ ముందుకు విచారణకు వచ్చాయి. ఉదయం కోర్టు ప్రారంభ సమయంలోనే ఈ కేసులను మరో న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.  తర్వాత అవి జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ బెంచ్‌ ముందుకు విచారణకు వచ్చాయి. సాయంత్రం 7 గంటల సమయంలో అవి విచారణకు రాగా మరో న్యాయమూర్తి ముందుంచాలంటూ తప్పుకున్నారు. దీంతో న్యాయవాదులు.. సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకొన్నారని, వీటిపై విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. దీంతో జస్టిస్‌ నగేశ్‌ భీమపాక.. పిటిషన్‌లకు చెందిన ఫైళ్లను తెప్పించి పరిశీలించి ఇది ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసు అని.. తాను కూడా తప్పుకుంటున్నానని తెలిపారు. దీంతో బెయిలు పిటిషన్‌ల విచారణకు గాలితో సహా దోషులు మరోవారం వేచి ఉండాల్నిన పరిస్థితి ఎదురైంది.
మైనింగ్ డాన్ ఎఫెక్ట్.. విచారణ నుంచి తప్పుకున్న ముగ్గురు జడ్జీలు Publish Date: May 29, 2025 2:11PM

బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించే ప్రశ్నే లేదన్న సంకేతం ఇంటి  ఆడబిడ్డపై సోషల్ మీడియాలో టార్గెట్ చేశారంటూ ఆరోపణ బీఆర్ఎస్  అధినేత కుటుంబంలో  అంతర్గత విభేదాల రచ్చకెక్కాయి. ఆ పార్టీ ఆవిర్భావం తరువాత ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోయింది. 2023 ఎన్నికలలో పరాజయం తరువాత కూడా పార్టీ ఇంతటి సంక్షాభాన్ని ఎదుర్కొనలేదు. ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకే సారి గుప్పిట తెరిచేశారు. తన ధిక్కారం, తిరుగుబాటు సోదరుడు కేటీఆర్ పైనే అని కుండబద్దలు కొట్టేశారు. కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓపెన్ అప్ అయిపోయారు. సొంత సోదరుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కుటుంబంలో చీలిక అనివార్యమని తేల్చేశారు. తాను సొంత పార్టీ పెట్టుకోవడం ఖాయమన్న సంకేతాలిచ్చేశారు. తన సోదరుడి నాయకత్వంలో పని చేసే ప్రశక్తే లేదని పరోక్షంగానైనా విస్పష్టంగా తేల్చి చెప్పారు.  బీఆర్ఎస్ లో ఏకైక నాయకుడు కేసీఆరేననీ, మరెవరి నాయకత్వాన్నీ తాను అంగీకరించే ప్రశ్నే లేదనీ కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఆమె  ఎలాంటి శషబిషలూ లేకుండా పార్టీపై ధిక్కార స్వరాన్ని చాలా చాలా గట్టిగా వినిపించారు. దీంతో ఆమెకు ఇప్పుడో, ఇహనో షోకాజ్ నోటీసు జారీ చేసి.. పార్టీ నుంచి ఉద్వాసన చెప్పాలని అధినేత భావిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు షోకాజ్ నోటీసు, పార్టీ నుంచి ఉద్వాసన విషయాన్ని పక్కన పెడితే కల్వకుంట్ల కవిత  మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ పునాదులకు కుదిపేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనంచేసే కుట్ర జరుగుతోందంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ రాష్ట్రంలో రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నంచీ కూడా ఆ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏర్పడిన తరువాత కూడా బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మైత్రి గురించిన ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఒక్క సారిగా బీఆర్ఎస్ గాలి తీసేశాయి. అంతే కాకుండా పార్టీలో తనను పక్కన పెట్టడం అన్నది ఇప్పుడు కాదనీ.. చాలా కాలం నుంచీ జరుగుతోందనీ ఆమె అన్యాపదేశంగా చెప్పారు. గతంలో అంటే మద్యం కుంభకోణం కేసులో తాను జైలుకు వెళ్లే సమయంలోనే పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయ్యానని కవిత చెప్పుకోచ్చారు. ఇక తాను జైలులో ఉన్న సమయంలోనే తనపై కుట్రలు మొదలయ్యాయని ఆరోపణలు గుప్పించారు. పార్టీలోని కొందరు నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత.. బీఆర్ఎస్ కు కేసీఆర్ వినా ఎవరి నాయకత్వాన్నీ తాను అంగీకరించేది లేదని కుండబద్దలు కోట్టడం ద్వారా.. తన సోదరుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడానికి తాను ససేమిరా అంగీకరించబోనని స్పష్టం చేశారు.   ఇక తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు తాను రాసిన లేఖ లీక్ కావడంపై ప్రశ్నిస్తే పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.   సొంత పార్టీ వాళ్లే సోషల్ మీడియాలో తననుటార్గెట్ చేశారన్న కవిత, ఇంటి ఆడబిడ్డపై సోషల్  మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులపై దాడి చేయిస్తారా అంటూ పేరు ప్రస్తావించకుండానే సోదరుడు కేటీఆర్ పై విరుచుకు పడ్డారు. నామీద పడి ఏడిస్తే ఏమొస్తుందంటూ పరోక్షంగానైనా తన తిరుగుబాటు సోదరుడిపైనేనని చెప్పేశారు.  తన లేఖను లీక్ చేసిన లీకు వీరులను పట్టుకోమంటూ గ్రీకు వీరులను తనపై రెచ్చగొట్టారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా సరే తన లేఖను లీక్ చేసిందెవరో చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ప్రణాళికాబద్ధంగా తనకూ కేటీఆర్ కు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందనీ, తనను దూరం చేస్తే పార్టీలో లాభ పడేదెవరో అందరికీ తెలుసు అనడం ద్వారా ఆమె అన్యాపదేశంగా కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇక ఇప్పుడు కవితకు ఉద్వాసన చెప్పి బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తారా? లేక మరో సారి కుమారుడి పట్టాభిషేక ముహూర్తాన్ని వాయిదా వేస్తారా అన్నది కేసీఆర్ నిర్ణయించుకోవలసిన పరిస్థితి వచ్చింది. మరి యువరాజ పట్టాభిషేకం జరుగుతుందా... మరోసారి వాయిదా పడుతుందా..చూడాల్సిందే. 
బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు Publish Date: May 29, 2025 1:25PM

చెరువులు, కుంటల్లో బడా విద్యాసంస్థలు.. స్పందించని హైడ్రాపై విమర్శలు

ప్రభుత్వ భూములను రక్షిస్తాం, చెరువులు, నాలాలు పరిరక్షిస్తాం,  హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి కాపాడుతాం.. హైడ్రా ఏర్పాటు లక్ష్యం ఇదే అన్నట్లు ప్రభుత్వ పెద్దలు గొప్పగా సెలవిచ్చారు. అయితే ఆ దిశగా మొదట్లో కొంత వేగంగా వెళ్లిన హైడ్రా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లలో ఆక్రమణలు ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని చెప్పిన హైడ్రా ఆ తర్వాత మానవతా దృక్పథం అంటూ తన వైఖరి మార్చుకుంది. వేసవి సెలవుల్లో అక్రమంగా వెలిసిన విద్య సంస్థల భవనాలను తొలగిస్తామని చెప్పిన అధికారులు సెలవులు పూర్తవుతున్నా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. హైడ్రా... హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పాటైన ఒకటి రెండు నెలల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు చెందిన భారీ నిర్మాణాలను కూలుస్తూ సంచలనాలకు తెరతీసింది. చెరువులు, బఫర్ జోన్లలో, ప్రభుత్వ భూముల్లో  అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతూ ప్రజల మన్ననలు పొందింది. సామాన్యులకు చెందిన నిర్మాణాలను కూల్చివేయడం, అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను ఉన్నపలంగా కూల్చివేస్తుందన్న ఆరోపణలతో హైడ్రాకు కొన్ని సందర్భాల్లో చెడ్డ పేరు కూడా వచ్చింది.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాల  తొలగింపులో హైడ్రా  చురుకైన పాత్ర పోషిస్తుందని భావించిన ప్రజలు అనేక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై వేలాది ఫిర్యాదులు చేశారు. నాలాలు, రోడ్లు, పార్కులు, ఓపెన్ స్పేసెస్‌లో ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు హైడ్రాకు వస్తున్నాయి.  భారీ నిర్మాణ సంస్థలు, రాజకీయ ప్రముఖులు చేసిన కబ్జాలపై సైతం హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి.  విద్యా సంస్థలు సైతం చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి భారీ నిర్మాణాలు చేశాయని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. అందులో ప్రముఖంగా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి చెందిన పలు కట్టడాలు ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి.  దుండిగల్ గ్రామ పరిధిలో చెరువు శిఖంలో భవనాలు నిర్మించారన్న ఆరోపణలతో అధికారులు కొంతమేర కూల్చివేతలు కొనసాగించారు. అక్కడ విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని,  వేసవి సెలవుల్లో మిగతా వాటిని పరిశీలిస్తామని చెప్పి వెళ్లిపోయారు, అయితే వేసవి సెలవులు పూర్తవుతున్నా ఆ ఆక్రమణల వైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఇక పాత బస్తీ సలకం చెరువు లో  కాలేజ్ నిర్మాణం జరిగిందని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఎంఐఎంకు చెందిన ప్రధాన వ్యక్తులు ఈ కాలేజ్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై అప్పట్లోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అయితే  అక్కడ కాలేజ్ రన్నింగ్ అవుతున్నందున ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. చెరువులు ఎంత ముఖ్యమో విద్యార్థుల ఎకడమిక్ ఇయర్ కూడా అంతే ముఖ్యమని,  అందుకు అనుగుణంగా సమయం ఇస్తామని, ఆ సమయంలోగా వారు సెటరైట్ చేసుకుంటే ఓకే..  లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే ప్రకటించారు.  ఇక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నిర్మాణాలు సైతం పోచారం మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్‌లోని  నాడెం చెరువు బఫర్ జోన్, ఎఫ్డీఏలో ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో వాటిని కూడా పరిశీలించారు అధికారులు. మెడికల్ కాలేజ్ నిర్మాణాలు చెరువులో ఉన్నట్లు గుర్తించారు. అయితే అప్పుడు విద్యాసంవత్సరం రన్నింగ్ లో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సెలవుల్లో వాటిపై చర్యలు తీసుకుంటారని అంతా భావించినా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రధాన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చెరువులు, నాలాలు ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేసినా, అలాంటి వాటిని కూల్చివేయకపోవడం వెనక కారణం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదట్లో ఫిర్యాదు వచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాలను   కూల్చివేసిన హైడ్రా ఆ తరువాత కొంత సడలింపులు ఇచ్చింది. అప్పటికే ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఇళ్లలో పబ్లిక్ నివాసం ఉంటే అలాంటి వాటిని కూల్చబోమని హైడ్రా ఒక ప్రకటన చేసింది. అయితే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పుకొచ్చిన అధికారులు ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ విషయంలో వేసవి సెలవుల్లో చర్యలు తీసుకుంటామని ప్రకటించారు . ఇప్పుడు సెలవులు పూర్తి అవుతున్నా అలాంటి వాటి జోలికి వెళ్లకపోవడం విమర్శల పాలవుతోంది.
చెరువులు, కుంటల్లో బడా విద్యాసంస్థలు.. స్పందించని హైడ్రాపై విమర్శలు Publish Date: May 29, 2025 12:44PM

ఈడీ ప్రశ్నలతో రాజ్ కేశిరెడ్డి ఉక్కిరిబిక్కిరి.. ఏడుగంటల విచారణ.. వాంగ్మూలం నమోదు

మద్యం కుంభకోణం కేసులో కింగ్ పిన్ గా భావిస్తున్న కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. కోర్టు అనుమతితో బుధవారం (మే28) ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈడీ అధికారులు విజయవాడ జిల్లా జైల్లో  రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని విచారించారు. ఈ సందర్భంగా కేశిరెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా మద్యం కుంభకోణం కేసులో అక్రమ నగదు ఎక్కడ నుంచి ఎక్కడకు చేరవేశాడన్న విషయంపైనే ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. దాదాపు ఏడు గంటల పాటు ఈడీ అధికారలు కేశిరెడ్డిని విచారించారు. వందకు పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.  ఈ కుంభకోణంలో కమిషన్ రూపంలో వసూలు చేసిన నగదును ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టారు? బ్యాంకు ఖాతాలు ఎన్ని?  ఏయే బ్యాంకులలో ఖాతాలు తెరిచారు వంటి ప్రశ్నలతో కేశిరెడ్డిని ఈడీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేసినట్లు చెబుతున్నారు.  ఏడుగంటల సుదీర్ఘ విచారణ అనంతరం కేశిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. ఇప్పటికే మద్యం కుంభకోణంపై ఈడీ మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  ఇలా ఉండగా ఇదే మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేశిరెడ్డిని మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టు గురువారం (మే29) తీర్పు వెలువరించింది. రాజ్ కేశిరెడ్డితో పాటు ఈ కేసులో అరెస్టైన  ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌, బాలాజీ గోవిందప్పలను కూడా కస్టడీకి అప్పగించాలంటూ సిట్ పిటిషన్ పై కూడా ఏసీబీ కోర్టు గురువారం (మే 29) తీర్పు వెలువరించనుంది.  
ఈడీ ప్రశ్నలతో రాజ్ కేశిరెడ్డి ఉక్కిరిబిక్కిరి.. ఏడుగంటల విచారణ.. వాంగ్మూలం నమోదు Publish Date: May 29, 2025 11:22AM

ఉత్తమనటుడు అల్లు అర్జున్.. ఉత్తమ సినిమా కల్కి

గద్దర్ అవార్డుల ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో 14 సంవత్సరాల   తరువాత సినీ పురస్కారాలు ప్రకటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాయుద్ధనౌక, దివంగత గద్దర్ పేరిట సినీ అవార్డులను అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.  అవార్డుల విజేతల జాబితాను తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అవార్డుల కమిటీ జ్యూరీ ఛైర్‌పర్సన్‌  సీనియర్ నటి జయసుధ ప్రకటించారు. 2024 సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రంగా కల్కి సినిమాకు అవార్డు ప్రకటించారు.   ఉత్తమ నటుడిగా పుష్ప2లో నటనకు గాను అల్లు అర్జున్, ఉత్తమ నటిగా 35  చిన్న కథ కాదు సినిమాకు నివేదా థామన్  ఎంపికయ్యారు. ఇక రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్. మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ కు పురస్కారాలు దక్కాయి. అలాగే ఉత్తమ దర్శకుడిగా కల్కి సినిమాకు గాను నాగ్ అశ్విన్ కు అవార్డు దక్కింది.    ఈ సారి   ఉత్తమ చిత్రాలు,  ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులకే కాకుండా  జాతీయ సమైక్యతను చాటిచెప్పే చిత్రాలు, ఫీచర్ ఫిల్మ్‌లు, బాలల చిత్రాలు, తెలంగాణ వారసత్వం, పర్యావరణం, చరిత్ర వంటి అంశాలపై నిర్మించిన సినిమాలకు కూడా ప్రత్యేక పురస్కారాలు అందశారు. యానిమేషన్ సినిమాలు, తొలిసారి దర్శకత్వం వహించిన వారి చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు, సామాజిక ప్రభావం చూపిన చిత్రాలు, లఘు చిత్రాల విభాగాల్లోనూ గద్దర్ అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు సినిమాపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాసిన వారికి, పుస్తకాలు ప్రచురించిన వారికి  కూడా గద్దర్ పురస్కారాలు దక్కాయి. గతంలో ప్రకటించిన కాంతారావు, పైడి జయరాజ్, ఎం. ప్రభాకర్ రెడ్డి వంటి ప్రముఖుల పేర్లతో ఉన్న అవార్డులను కూడా కొనసాగించారు.
ఉత్తమనటుడు అల్లు అర్జున్.. ఉత్తమ సినిమా కల్కి Publish Date: May 29, 2025 11:01AM

మహానాడు చివరిరోజు... 5 లక్షల మందితో భారీ సభ

కడప వేదికగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పండుగ  మహానాడు గురువారం ( మే 29) తో ముగియనుంది.  మంగళవారం (మే 27)న ప్రారంభమైన మహానాడు తొలి రెండు రోజులు అత్యంత విజయవంతంగా జరిగాయి. జగన్ పార్టీకి పెట్టని కోటగా చెప్పుకునే కడప వేదికగా జరిగిన ఈ మహానాడు పలు ప్రత్యేకతలక వేదికైంది.   మహానాడులో భాగంగా తొలి రెండు రోజులూ   ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ప్రతినిధుల సమావేశాలు నిర్విరామంగా జరిగాయి. ఈ సమావేశాలకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక చివరి రోజైన గురువారం (మే 29)న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు దాదాపు 5 లక్సల మంది హాజరౌతారన్నది అంచనా. ఈ సభలో పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర ముఖ్య నాయకుల ప్రసంగాలు ఉంటాయి.   ఐదేళ్ల జగన్ అరాచక పాలన తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాది పూర్తి కావస్తున్నది. ఈ కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన, చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను వివరించడమే కాకుండా... పార్టీ, ప్రభుత్వ భవిష్యత్ లక్ష్యాలపై కూడా ఈ ప్రసంగాలు ఉంటాయి.  ఇక ఈ బహిరంగ సభ కోసం నిరవాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో దాదాపు 2 లక్షల మందికి భోజన సౌకర్యం కల్పించారు. అలాగే కడపకు దారి తీసే మార్గాలలో మరో మూడు లక్సల మందికి భోజన వసతి ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇలా ఉండగా కడపలో మహానాడు సందర్భంగా కడప జిల్లా మొత్తం పసుపుశోభ సంతరించుకుంది. ఎక్కడ చూసినా పసుపుపచ్చని జెండాలు, తోరణాలతో పంగుడ వాతావరణం నెలకొంది.  
 మహానాడు చివరిరోజు... 5 లక్షల మందితో భారీ  సభ Publish Date: May 29, 2025 10:23AM

సెల్ టవర్ ఎక్కిన మహిళ.. ఎందుకంటే?

తెలుగుదేశంపార్టీ మహిళ నాయకురాలు చిప్పగిరి మీనాక్షి  ఆత్మహత్య చేసుకుంటానంటూ కడప ఎన్టీఆర్ సర్కిల్ లోని  సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది.  ఒక  పక్క రాష్ర్ట స్థాయి మహానాడులో ముఖ్యమంత్రి పాల్గొంటుండడం, మరో పక్క మీనాక్షి సెల్ టవర్  ఎక్కి ఆందోళన చేయడంతో  తెలుగుదేశంపార్టీ నాయకులు ఆందోళనకు గురయ్యారు.  వన్ టౌన్ పోలీసులు, ఫైర్, రెవిన్యూ సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొని టవర్  క్రింద దిగాలని కోరారు. పోలీసు అధికారుల మైకు ద్వారా మాట్లాడుతూ సెల్ టవర్ పై నుండి కింద కు దిగాలని, మీ డిమాండ్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మిమ్మలను మహానాడు వద్దకు తీసుకు రావాలని లోకేష్ కోరారని ,వెంటనే క్రిందకు దిగితే మిమ్మలను లోకేష్ వద్దకు తీసుకు వెడతామంటూ పోలీసులు మీనాక్షికి మైకు ద్వారా కోరారు.   దీంతో ఆమె కిందకి దిగి వచ్చారు. వెంటనే ఆమెనను   ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.  ఇంతకీ మీనాక్షి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేయడానికి కారణం.. రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్నా గుర్తింపు లేదన్న ఆవేదనే. ఇదే విషయం ఆమె మీడియాకు చెప్పారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా లేఖ రాశారు. ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి దళితురాలినైన తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అన్నిటికీ మించి మహానాడుకు తన లాంటి   వారికి ఆహ్వానం లేక పోవడం బాధాకరమని పేర్కొన్నారు. 
సెల్ టవర్ ఎక్కిన మహిళ.. ఎందుకంటే? Publish Date: May 29, 2025 9:59AM

డోజ్ చైర్మన్ పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా ట్రంప్ కి బిగ్ షాక్!

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వంలో తాను నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్) ఛైర్మన్ పదవికి రాజీనామా  చేశారు. తన రాజీనామాను ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ప్రకటించారు.   అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించే కాలపరిమితి ముగిసిందని, అందుకే ఆ పదవికి రాజీనామా చేస్తున్నాననీ మస్క్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  ప్రభుత్వంలో అనవసరపు ఖర్చులను తగ్గించే కార్యక్రమంలో తనకు అవకాశం కల్పించిన ట్రంప్ కు కృతజ్ణతలు చెబుతూనే.. తన రాజీనామా తరువాత కూడా డోజ్  మరింత పటిష్టంగా పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని మస్క్ ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండో సారి అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఆయన   ప్రభుత్వ విభాగాల్లో   వృథా ఖర్చులను అరికట్టడం  అనే లక్ష్యంతో డోజ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ డోజ్ కు ఎన్నికల ప్రచారంలో తనకు అన్ని విధాలుగా సహకరించిన ఎలాన్ మస్క్ ను చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా చేయడం డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. 
  డోజ్ చైర్మన్ పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా ట్రంప్ కి బిగ్ షాక్! Publish Date: May 29, 2025 9:44AM

మనసు బాగోకపోతే... ఆర్థికంగా దివాళా!

ఆర్థిక సమస్యలు మనిషిని మానసిక ఒత్తిడికి లోను చేస్తాయని తెలుసు. కానీ మానసిక ఒత్తిడి మరిన్ని ఆర్థిక సమస్యలకి దారితీస్తుందనీ... ఇదొక విషవలయం అనీ ఎప్పుడన్నా అనిపించిందా! ఈ విషయంలోని నిజానిజాలను తెలుసుకునేందుకు బ్రిటన్‌కు చెందిన ‘Money and Mental Health Policy Institute’ ఒక పరిశోధనను నిర్వహించింది. ఇందులో భాగంగా 5,500 మంది అభిప్రాయాలను సేకరించింది. మానసికమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారి ఆర్థిక జీవితం ఏమంత సజావుగా సాగడం లేదని ఈ పరిశోధన నిరూపించింది. విచ్చలవిడిగా ఖర్చుపెట్టేయడం, అవసరం లేకున్నా అప్పులు తీసుకోవడం, ఆదాయాన్ని కాపాడుకోలేకపోవడం... ఇలా డబ్బు మీద నియంత్రణని కోల్పోతున్నారని తేలింది. చాలా తక్కువ ఆదాయం కలిగినవారు కూడా ఇలా ఆర్థిక నియంత్రణను కోల్పోవడం ఆశ్చర్యకరం! ఈ సంస్థ నివేదిక ప్రకారం, మానసిక ఒత్తిడిలో ఉన్నవారిలో... - 93 శాతం మంది తాము అవసరానికి మించి ఖర్చుపెడుతున్నామని ఒప్పుకున్నారు. - 92 శాతం మంది తాము ఆర్థిక నిర్ణయాలను తీసుకోలేకపోతున్నామని తేల్చిచెప్పారు. - 59 శాతం, తమకి అవసరం లేకపోయినా కూడా అప్పులు తీసుకుంటున్నామని తెగ బాధపడిపోయారు. అవసరం లేకపోయినా అప్పులు తీసుకోవడమే కాదు... ఆ రుణాలకి సంబంధించిన నిబంధనలను అర్థం చేసేకోకుండానే రుణ ఒప్పందాలు పూర్తిచేశామని 24 శాతం మంది వాపోయారు. మరో 38 శాతం మంది ఆ అప్పు తీసుకునే సమయంలో తనకి ఏం చెప్పారో కూడా గుర్తులేదని చెప్పుకొచ్చారు. అనవసరంగా అప్పులకు దిగడం మాట అటుంచి, ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏకంగా 38 శాతం మంది ఉద్యోగాన్ని కోల్పోయారని తేలింది. ఇలా ఆర్థిక నియంత్రణను కోల్పోవడం వల్ల ఇతరత్రా సమస్యలు కూడా చాలానే బయటపడ్డాయి. అప్పటిదాకా పొదుపు చేసుకున్న సొమ్మంతా ఆవిరైపోవడం, ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం, ఆర్థిక సంబంధాలను చెడగొట్టుకోవడం... వంటి దీర్ఘకాలిక నష్టాలతో జీవితం కునారిల్లిపోతుందిట. పైన పేర్కొన్న కారణాలన్నింటివల్లా... మానసికమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు పరిశోధకులు. మనసులో ఉన్న అలజడి ఉపశమించేందుకో, సమాజంలో విలువను పెంచుకునేందుకో, అలవాటుగానో, నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లనో... ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టించే మానసిక స్థితిని గమనించుకోమని సూచిస్తున్నారు. మరోవైపు అటు వైద్యులు కానీ, ఇటు ఆర్థికరంగ సలహాదారులుకానీ తమ దగ్గరికి వచ్చేవారిలో మానసిక ఒత్తిడిని గమనించడమూ... వారి ఆర్థిక స్థితి మీద ఆ ఒత్తిడి ప్రభావం కలుగకుండా తగు హెచ్చరికలు చేయడమూ ఉండాలి. - నిర్జర. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
మనసు బాగోకపోతే... ఆర్థికంగా దివాళా! Publish Date: May 29, 2025 9:30AM

వృద్ధాప్యం జీవితం ఆనందంగా ఉండాలంటే... ఈ విషయాలు ఆచరణలో పెట్టుకోవాల్సిందే!

జీవితం జాంగ్రీ ఏమి కాదు, ఎప్పుడూ జ్యుసీ గా ఉండటానికి. యూత్ గా ఉన్నపుడు తరువాత బాగా సంపాదిస్తున్నపుడు ఉన్నట్టు వయసు పెరిగిపోయాక ఉండలేరు. కారణాలు బోలెడు ఉండచ్చు ఆ కారణాలు అన్ని కూడా జీవితాన్ని అయిదు పదుల తరువాత కాస్త భయంలోకి నెడుతున్న పరిస్థితులు ప్రస్తుత కాలంలో కోకొల్లలుగా చూస్తున్నాం. అయితే అయిదు పదుల తరువాత, వృద్ధాప్యం జతకట్టాక జీవితం ఆనందంగా ఉండాలంటే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యాన్ని కూడా ఆనందమానందమాయే అనుకుంటూ గడిపేయచ్చు.  చాలామంది ఉద్యోగాల కోసం దూరప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే సొంత ఊరిలో ఉన్న భూములు, ఇల్లు లాంటివి కొన్ని అవసరాల దృష్ట్యా లేక అక్కడెందుకు అనే కారణాలతో అమ్మేస్తుంటారు. ఆ పనిని అసలు చేయకండి. విశ్రాంత జీవితం సొంత ఊర్లో స్వేచ్ఛగా, గౌరవంగా  ఉండేలా చేస్తుంది.  ఇన్సూరెన్స్ లు డిపాజిట్ లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇలాంటివన్నీ పిల్లల పేరుతో వేయచ్చు కానీ మొత్తం కాదు సుమా!! ప్రేమను డబ్బు ద్వారా ఇలాంటి డిపాజిట్ ల ద్వారా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకంటూ కాసింత ఆర్థిక భరోసా కల్పించుకోవాలి మీరే ఆధారపడటం చాలా పెద్ద తప్పు. పిల్లలు ఉద్దరిస్తారు అనే ఆశ అసలు పెట్టుకోకండి. కాలం ఎలాగైతే వేగంగా గడిచిపోతున్నట్టు అనిపిస్తోందో, మనుషులు కూడా అలాగే వేగంగా మారిపోతూ ఉంటారు. కాబట్టి డిపెండింగ్ ఈజ్ ఏ బిగ్ మిస్టేక్. మానసిక విషయాల్లో వెన్నుదన్నుగా నిలబడి, జీవితంలో మంచి సలహాలు ఇస్తూ వస్తున్న వారిని చిన్న చిన్న గొడవలు కారణంగా వధులుకోకండి. చుట్టాలు, పిల్లలు కూడా చూపించలేని ఆప్యాయత నిజమైన స్నేహితుల దగ్గర మాత్రమే దొరుకుతుంది. కంపెర్ చేసుకోవడం చాలా పెద్ద మూర్ఖత్వపు చర్య. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు చేస్తున్న పనులు బాగున్నాయి, వాళ్ళలా మేము లేము. లాంటి విషయాలను మొదట దరిదాపులకు కూడా రానివ్వకూడదు. ఫలితంగా నా జీవితం బాగుంది అనే తృప్తి సొంతమవుతుంది.   జెనెరషన్స్ మారే కొద్దీ జీవితాల్లో మార్పులు సహజం. ఒకప్పటిలా ఇప్పటి తరం లేదు, ఇప్పటిలా రేపటి తరం ఉండదు. దీన్ని ఒప్పుకోగలగాలి. పిల్లల జీవితాల విషయంలో జోక్యం చేసుకోకూడదు. వారికి నచ్చినట్టు వారిని ఉండనివ్వాలి. అటెన్షన్ కోరుకోకూడదు. బాల్యం, యవ్వనం, మధ్య వయసు ఎలాంటిదో వృద్ధాప్యం కూడా అలాంటిదే. వృద్ధాప్యమనే కారణం చూపెట్టి కొడుకులు, కొడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో పనులు చేయించుకోవాలనే ఆలోచన వదిలిపెట్టేయాలి. సాధ్యమైనంతవరకు మీ పనులను మీరు చేసుకోవడం ఉత్తమం. సాధ్యం కాని పక్షంలో పరిస్థితిని మెల్లగా వివరించి చెప్పాలి కానీ పెద్దవయసు అనే అజమాయిషీ ఉండకూడదు. పిల్లల పట్ల ప్రేమతో ప్రతీది తమ పొరపాటుగా ఒప్పేసుకోకండి. ఏదైనా సరే చెప్పే విధానంలో ఉంటుంది. తప్పేక్కడుంది అనే విషయాన్ని సున్నితంగా చెప్పి అంతే సున్నితంగా దాన్ని వదిలేయండి. దేన్నీ ఎక్కువగా లాగకూడదు. వయసయ్యే కొద్ది ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈకాలంలో బిపి, షుగర్ లేని వాళ్లు కేవలం 1% మంది ఉండచ్చేమో. అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తగినంత తేలికపాటి వ్యాయామాలు, కనీస నడక. యోగ, ప్రాణాయామం వంటివి చేయాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఎదో ఒకటి తినేయకూడదు. కాస్త తక్కువ ధరల్లోనే పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎంచుకుని తీసుకోవాలి.  ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు సంతోషంగా ఉంటూ, ఇతరులకు ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించండి. మానసిక ప్రశాంతత చాలా అవసరం సుమా!! సంతోషం కావాలంటే పెద్ద ఖర్చులు అవుతాయని అనుకోవడం భ్రమ. ఉన్నంతలో చిన్న టూర్ ప్లాన్ చేసుకుని జీవిత భాగస్వామితో కలసి వెళ్ళండి. వృద్ధాప్య దశలోనే ఒకరికొకరు అనే భరోసా, ఆప్యాయత ఎక్కువ ఉండాలి.  జీవితంలో శాశ్వతమైనదేదీ లేదు.. అలాగే దు:ఖాలు కూడా శాశ్వతం కాదు. ఈ మాటను విశ్వసించండి. చిన్న చిన్న వాటికి బాధపడకుండా ఒత్తిడిని వీలైనంగా దూరం ఉంచండి.  మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడే అది  అసలైన స్వేచ్చతో జీవించడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పై విషయాలు కేవలం చదవడం మాత్రమే కాకుండా ఆచరణలో పెడితే వంద శాతం వృద్ధాప్యాన్ని లాహిరి లాహిరి లాహిలో….. అని పాడేసుకుంటూ ఆనందంగా గడిపేయచ్చు మరి. ◆ వెంకటేష్ పువ్వాడ  
 వృద్ధాప్యం జీవితం ఆనందంగా ఉండాలంటే... ఈ విషయాలు ఆచరణలో పెట్టుకోవాల్సిందే! Publish Date: May 29, 2025 9:30AM

కాంగ్రెస్ తో కవిత బేరం? నిజమేనా?

స‌ర్క‌మ్ స్టెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్.. అంటూ ఒక‌టుంటుంది. దీని అర్ధ‌మేంటంటే వారి వారి మాన‌సిక- శారీర‌క- సామాజిక- రాజ‌కీయ- ఆర్ధిక‌- స్థితిగ‌తుల‌ను అనుస‌రించి వారెలా బిహేవ్ చేస్తారో.. ఒక అంచ‌నాకు రావ‌డం. దీన్నే ఇప్పుడు రెడ్ టీమిజం అని కొత్త‌గా కూడా పిలుస్తున్నారు. ఇది వేరే విష‌యం.  ఇక్క‌డ క‌విత‌కు అలాంటి ప‌రిస్థితి ఉందా? లేక బీఆర్ఎస్ పార్టీకే ఇలాంటి సిట్యువేష‌న్ త‌లెత్తిందా? అని చూస్తే ఇది జ‌స్ట్ క‌విత ప‌రిస్థితిలా క‌నిపించ‌డం లేదు. బీఆర్ఎస్  ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది. ఒక వేళ క‌వితే కాంగ్రెస్ లోకి వెళ్తే.. కాళేశ్వ‌రం విష‌యంలో కావ‌చ్చు, ఈ- కార్ రేస్ విష‌యంలో కావ‌చ్చూ.. బీఆర్ఎస్ కి   ఒక రిలీఫ్ రావ‌చ్చు. కార‌ణ‌మేంటంటే.. క‌వితే కాంగ్రెస్ లో ఉంటే.. ఇలాంటి అంశాల్లో చేతి పార్టీ ప్ర‌భుత్వం అంత అగ్రెసివ్ గా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌క పోవ‌చ్చు. దీంతో క‌విత ద్వారా కేసీఆర్ ఇటు నుంచి న‌రుక్కొస్తున్న‌దిగా ఒక అంచ‌నా. ఇక రెండోది.. దీన్ని రేవంత్ , ఆయ‌న స‌న్నిహితులు ఇటు పీసీసీ అటు కేంద్ర నాయ‌క‌త్వాన్ని వ‌ద్ద‌ని వారించిన‌ట్టు భావించ‌డం. అదేమంటే అన‌వ‌స‌రంగా కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన నింద మ‌న మీద వేసుకోవ‌డం ఎందుక‌ని.. వారు అనుకున్న‌ట్టు! అందుకే వ‌ద్ద‌న్న‌ట్టు చెప్ప‌డం కూడా ఒక‌ర‌కంగా.. తాను చంపబోయే జింక‌ను చూసి పులే జాలి ప‌డ్డ‌ట్టుగా ఉంది. ఇప్పుడు న‌డుస్తోన్న‌దంతా ఏంటి? త‌న‌ను కేసీఆర్ జైలుకు పంపిన‌ట్టే నేను కూడా ఆయ‌న్ను పంపాల‌న్న‌దే క‌దా? కేటీఆర్ ని కూడా వ‌ద‌ల‌కుండా వెంటాడి వేటాడి రివేంజ్ తీర్చుకోవ‌డ‌మే అస‌లు ఉద్దేశం అదే క‌దా? అంటారు కొంద‌రు ఎన‌లిస్టులు.  బేసిగ్గా ఇవ‌న్నీ జ‌ర‌క్కుండా క‌డియం శ్రీహ‌రి చెప్పిన‌ట్టు కేసీఆర్ తొలి నాళ్ల‌లోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చి ఉండొచ్చు. ఆ పార్టీ ఎమ్మెల్యేల‌ను కొంద‌ర్ని కొని.. సొంతంగా అధికారంలోకి రావ‌చ్చు. ఇందుకు ఆస్కారాలు లేక పోలేదు. కానీ కేసీఆర్ అస‌లైన ఆలోచ‌న అది కాదు. డీఎంకే, అన్నాడీఎంకే ఫార్ములా... అంటే  ఇక్క‌డ కూడా బీఆర్ఎస్, టీబీఆర్ఎస్ ఉండాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒక వేళ అలా లేకుంటే అధికార పార్టీ కాంగ్రెస్ లో మ‌న వాళ్లు ఎవ‌రో ఒక‌రుండ‌టం. మ‌రీ లేకుంటే బీజేపీలో ఉండ‌టం. ఒక సారి మ‌నం (అంటే బీఆర్ఎస్) అధికారంలోకి వ‌చ్చినా.. రెండో సారి అటు వైపు వాళ్లు(కాంగ్రెస్ లేదా బీజేపీ) అధికారంలోకి వ‌చ్చినా.. మ‌న వాళ్లు అటు వైపు ఉంటారు కాబ‌ట్టి.. మ‌నం ఎన్ని చేసినా చెల్లుబాటు అయ్యేలా ఒక ఎత్తుగ‌డ‌. ఇదీ కేసీఆర్ 2018 నాటి నుంచి క‌ల‌లు కంటోన్న పొలిటిక‌ల్- స్కెచ్. ఇప్పుడున్న రోజుల్లో అధికారంలో లేకుంటే ఏం జ‌రుగుతుందో అంద‌రికీ తెలుసు. ప‌రిపాల‌న‌లో ఏవో ఒక లోటు పాట్లు ఉండ‌నే ఉంటాయి. అధికారం పోయాక‌ వాటిని అడ్డు పెట్టుకుని ఏవో కేసులు పెట్టి ఇబ్బంది పెట్ట‌డం ఇప్పుడు కామ‌న్  అయిపోయింది. ఈ కండీష‌న్లో.. మ‌న‌మ‌లా ఇరుకున ప‌డ‌కుండా ఉండాలంటే ఇదే సేఫ్ ప్లాన్. ఇందులో భాగ‌మే ఒక క‌విత- ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక మంత్రి ప‌ద‌వి కాన్సెప్ట్ గా అంచ‌నా వేస్తున్నారు కొంద‌రు. అర్ధమ‌వుతోందా!?
కాంగ్రెస్ తో కవిత బేరం?  నిజమేనా?  Publish Date: May 29, 2025 9:25AM

కరోనా కలకలం.. చండీగఢ్‌లో వైరస్‌తో ఒకరు మృతి

  కరోనాతో పంజాబ్‌ చండీగఢ్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. చండీగఢ్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలోని సెక్టార్‌-32లో బుధవారం 40 సంవత్సరాల వ్యక్తి కొవిడ్‌ బారినపడి చనిపోయాడని ఓ అధికారి పేర్కొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సదరు రోగి మంగళవారం ఆసుపత్రిలో చేరాడని.. అతనికి కొవిడ్‌ సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందించారు. అతనికి కరోనాతో పాటు ఇతర వ్యాధులూ ఉన్నాయని దీంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఇవాళ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. భారత్‌లో సోమవారం వెయ్యికిపైగా యాక్టివ్‌ కొవిడ్‌ కేసులు ఉన్నట్లుగా కేంద్ర రోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. అత్యధికంగా యాక్టివ్‌ కేసులు కేరళలో 430 ఉండగా.. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, కర్నాటకలో అత్యధికంగా ఉన్నాయి.  
కరోనా కలకలం.. చండీగఢ్‌లో వైరస్‌తో ఒకరు మృతి Publish Date: May 28, 2025 9:34PM

అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి ఆయుధాలు

  అస్సాం ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు ఎక్కువ ప్రాంతాలో స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయంచింది. ముస్లింలు ఎక్కువ ప్రాంతాల్లో అలాగే బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాల్లో నివసించే స్థానిక, ఆదివాసీ ప్రజలకు భద్రత కోసం గన్ లైసెన్సులు  ఇవ్వాలని  సీఎం హిమంత బిశ్వ శర్మ  కీలక ప్రకటన జారీ చేశారు.  గౌహతిలోని లోక్ సేవా భవన్‌లో జరిగిన మంత్రి వర్గ మీటింగ్ జరిగిన తర్వాత శర్మ మాట్లాడుతూ.. నాగావ్‌లోని ఢింగ్, రూపోహి, దక్షిణ సల్మారా, గౌహతిలోని హాటిగావ్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఈ లైసెన్సులు ఇస్తామని చెప్పారు. ఈ ప్రాంతాలను ప్రభుత్వమే గుర్తిస్తుందని, దరఖాస్తుదారులు నేర చరిత్ర లేకుండా ఉండాలని షరతు విధించారు. అస్సాం అల్లర్లు సమయం నుంచి స్థానికులు ఈ డిమాండ్ చేస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నరు. 
అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి ఆయుధాలు Publish Date: May 28, 2025 8:29PM

10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం : సీఎం చంద్రబాబు

  తెలుగుజాతి ఉన్నంత కాలం తెలుగు దేశం పార్టీ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు.  దేవుడి ఇచ్చిన శక్తి మేరకు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తాని ఆయన అన్నారు. నా బలం, బలగం టీడీపీ నాయకత్వమే అన్నారు. నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ  ధన్యవాదాలు తెలిపారు. మహానాడులో ఆరు శాసనాలపై అర్థవంతంగా చర్చలు జరిగాయి. రాబోయే 40 ఏళ్లకు ప్రణాళిక రచించుకున్నాం. నక్సలిజం రూపుమాపడానికి నిరంతరం పోరాడిన పార్టీ టీడీపీ అని ఆయన అన్నారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదముట్టించి అభివృద్ధికి బాటలు పరిచామని పేర్కొన్నారు.  రాయలసీమ రాళ్ల సీమ కాదు..రత్నాల సీమగా మారుస్తానని చెప్పాని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ కంటే సంపదలో అనంతపురం ముందుండడానికి టీడీపీ అని అన్నారు.  బసకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని సీఎం చంద్రబాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నేను ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదని ఆయన అన్నారు. నదుల అనుసంధానంతో తెలంగాణకు లాభమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లు అని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేసింది నేనే అని ఆయన అన్నారు. 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.రూ.9వేల కోట్లతో కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. దీంతో కడప స్టీల్‌ ప్లాంట్ ద్వారా 3వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆయన తెలిపారు.175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి.. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.  
10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం : సీఎం చంద్రబాబు Publish Date: May 28, 2025 7:30PM