పది రోజుల్లో కడప స్టీల్ పనులు.. ఇక జిల్లాలో జగన్ ను పట్టించుకునేదెవరు?

కడప జిల్లా… ఎలాంటి డౌటూ లేదు.. ఈ జిల్లా జగన్ కు కంచుకోటే. అయితే ఆ కోటకు బీటలు వారాయన్నదీ అంతే నిజం. గత ఏడాది జరిగిన ఎన్నికలలో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడింటిలో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.  అయినంత మాత్రాన కడపలో వైసీపీ గాలిపోయిందన్న నిర్దారణకు రావడం సరి కాదు. వైఎస్ హయాం నుంచీ కూడా ఆ కుటుంబానికి కడప జిల్లా పెట్టని కోట లాంటిది. జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో అన్ని వర్గాలను ఎలా అయితే దూరం చేసుకున్నాడో.. అలాగే కడపనూ దూరం చేసుకునే పరిస్థితికి వచ్చారు. చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా జిల్లాలో తన సొంత నియోజకవర్గమైన పులివెందుల సహా మూడు నియోజకవర్గాలలో పట్టు నిలుపుకోగలిగారు. అటువంటి కడపలో  తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది. అలా నిర్వహించి ఊరుకోలేదు. మహానాడు వేదికగా కడప జిల్లాకు వరాలు కురిపించింది. వాటిల్లో అతి ముఖ్యమైనది కడప స్టీల్ ఫ్యాక్టరీ. పది రోజుల్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు మహానాడు వేదికగాప్రకటించారు. ఇది కడప జిల్లా ప్రజల మూడ్ ను ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం నోటి మాటగా చంద్రబాబు కడప స్టీల్స్ గురించి చెప్పి ఊరుకోలేదు. కడప స్టీల్ ఎన్నాటు చేస్తున్న సంస్థకు ఈ మేరకు డెడ్ లైన్ కూడా విధించారు.  
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తి కానున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 12కు ఏపీలో తెలుగుదేశం కూటమి సర్కార్ అధికారపగ్గాలు అందుకుని ఏడాది అవుతుంది. కూటమి ప్రభుత్వ తొలి వార్షికోత్సవం లోగా కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాల్సిదేనని సంబంధిత కంపెనీకి చంద్రబాబు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.

కడప స్టీల్ ప్లాంట్ తొలి దశలో 3వేల మందికి ఉపాధి లభిస్తుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో కడప అభివృద్ధి దిశగా పరుగులు పెట్టడం ఖాయమనడంలో సందేహం లేదు. కడప స్టీల్స్ విషయంలో ఐదేళ్ల పాటు ఏం చేయకుండా వైసీపీ చేతులు ముడుచుకుని కూర్చుంది. ఇప్పుడు చంద్రబాబు కూటమి కడప స్టీల్ ప్లాంట్ పనులు పది రోజుల్లో ప్రారంభమౌతాయని ప్రకటించడంతో జిల్లాలో ఇక జనగ్ ను కానీ, జగన్ పార్టీని కానీ పట్టించుకునే నాథుడు ఉండకపోవచ్చని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News