రేవంత్ రెడ్డి గురించి అల్లు అర్జున్ ఏం చెప్పబోతున్నాడు!
on May 29, 2025

పద్నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 'గద్దర్'(Gaddar)అవార్డుల్ని ఈ రోజు ప్రకటించింది. ఈ సందర్భంగా అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ మాట్లాడుతు అవార్డుల ప్రకటనలో ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రేక్షకాదరణ పొందిన సినిమాలతో పాటు మంచి సినిమాలని గద్దర్ అవార్డ్స్ కి సెలెక్ట్ చేశామని చెప్పడం జరిగింది.
ఆమె చెప్పిన మాట అక్షర సత్యమనే నిజం అవార్డుల్ని ప్రకటించిన తర్వాత అర్థమవుతుందని సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. పుష్ప 2(Pushpa 2)రిలీజ్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ లో రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ విషయంలో అల్లు అర్జున్(Allu Arjun)పై కేసు నమోదు కావడంతో పాటు ఒక రోజు జైలులో కూడా ఉన్నాడు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా కావాలనే అల్లుఅర్జున్ ని జైల్లో ఉంచిందనే వాదనలని పలువురు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ వార్తలన్నీ ఒట్టి రూమర్స్ అనే విషయం అర్ధమవుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులలో పుష్ప 2 కి సంబంధించి అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు ప్రకటించింది. దీంతో ఆర్టిసుల మీద తెలంగాణ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించదని చెప్పడానికి, ఇంతకంటే ఉదాహరణ ఉండదనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.
సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డ్స్ ఇచ్చిన నేపథ్యంలో, జూన్ 14 న హైదరాబాద్ లో ఎంతో వైభవంగా ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు అల్లు అర్జున్(Allu Arjun)హాజరు కావాల్సిందే. రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే అల్లుఅర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డుని అందుకోవాలి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడతారనే ఆసక్తి అందరిలో ఉంది. అల్లు అర్జున్ అభిమానులైతే తమ హీరోకి గద్దర్ అవార్డు రావడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



