చిరంజీవికి కథ చెప్పిన ప్రముఖ హీరో.. కూతురు కోసమే ఇదంతా
on May 28, 2025

రెండున్నర దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా స్టార్ గా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోగా చేసి తన సత్తా చాటాడు యాక్షన్ కింగ్ అర్జున్(Arjun). ఆయన స్వీయ దర్శకత్వంలో 'సీతా పయనం'(Seetha Payanam)అనే మూవీ తెరకెక్కుతుంది. హీరోయిన్ గా అర్జున్ కూతురు ఐశ్వర్య(Aishwarya)చేస్తుండగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(Upendra)సోదరుడి కుమారుడు నిరంజన్(Nirajnjan)హీరోగా పరిచయం కాబోతున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్(HYderabad)లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)గారికి' సీతా పయనం' స్టార్ట్ కాకముందు ఈ కథ చెప్పాను. రెండు మూడు సార్లు సిట్టింగ్స్ కూడా జరిగాయి. దీంతో ఒక రకంగా చిరంజీవి గారి కంట్రిబ్యూట్ ఈ సినిమాకి ఉంది. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కూడా ఈ సినిమా ఓపెనింగ్ కి వచ్చి మనమంతా ఒకటే అని చెప్పారు. నా కూతురు కోసమే సీతా పయనం స్టార్ట్ చేశాను. కానీ ఎలా పడితే అలా కాకుండా చాలా జాగ్రత్తగా చేశాను. ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించినట్టే నా కూతుర్ని కూడా ఆదరించాలని అర్జున్ చెప్పుకొచ్చాడు
సత్యరాజ్, ప్రకాష్ రాజ్, సిరి, చరణ్, కీలక పాత్రల్లో కనిపిస్తుండగా అర్జున్, ధృవ్ సర్జా కూడా స్క్రీన్ పై మెరవనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం వహించగా చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



