ఈ పెద్దాయన మహా అభిమాని.. 400 కిలోమీటర్లు సైకిల్‌పై మహానాడుకు

 

ఈ పెద్దాయన తెలుగుదేశం పార్టీకి మహా అభిమాని 400 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేస్తూ కడపలో జరిగిన మహానాడుకు హాజరయ్యారు. మండే ఎండలు మధ్య మధ్యలో వానలు అయినా లెక్క చేయకుండా ఏడు పదులు దాటిన వయసులో 400 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలంటే సాహసమే..అయినా అభిమానం ముందు ఆ సాహసం ఆయనకు పెద్ద లెక్కే కాకుండా పోయింది. ధూళిపూడి మునేశ్వరరావు అనే  ఈ పెద్దాయనది అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు. 

తెలుగుదేశం పార్టీ అంటే వల్లమాలిన అభిమానం కడపలో జరుగుతున్న మహా పండుగ కు తమ తెలుగుదేశం పార్టీ గుర్తు,పేదోడి రధం అయిన సైకిల్ పై వచ్చారు. ఈయనకు టిడిపి అంటే వీరాభిమానం 400 కిలోమీటర్లు సైకిల్ పై వచ్చిన ఈ పెద్దాయన గురించి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు ఆయన్ను వేదికపై కి పిలిచి అందరికీ చూపిస్తూ స్ఫూర్తి దాత అంటూ కితాబిచ్చి అభినందించారు. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి కార్యకర్తలు ఉండం పూర్వజన్మ సుకృతం అని చంద్రబాబు కొనియాడారు. వేదికపై ఉన్న నారా లోకేష్ సైతం లేచి చప్పట్లు కొడుతూ అభినందించారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu