భారీ వర్షాలకు నిలిచిన రవాణా.. కుళ్లిపోతున్న యాపిల్ పండ్లు

దేశంలో  వివిధ ప్రాంతాల్లో రైతుల కష్టాలు రోజురోజుకు అధికమవుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ లో ఉల్లిరైతులు, జమ్మూ కశ్మీర్ లో యాపిల్ రైతులు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఏపిలో ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరలు అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కశ్మీర్ లో భారీ వర్షాల కారణంగా  యాపిల్ పండ్ల రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీనివల్ల పండ్లు కుళ్లిపోయి రైతులు నష్టాల పాలౌతున్నారు.  

జమ్మూ కాశ్మీర్ లో గత ఇరవై రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల  రహదారులు అధ్వానంగా మారాయి. దీంతో యాపిల్ పండ్ల రవాణా ఎక్కడిక్కడ నిలిచిపోయింది. యాపిల్ పండ్లలోడుతో బయలుదేరిన లారీలు మార్గ మధ్యంలోనే నిలిచిపోయాయి. ఒకవైపు వర్షాలు.. మరోవైపు రోజుల తరబడి దిగుమతి చేయకుండా ఉండటంతో యాపిల్ పండ్లు కుళ్ళిపోతున్నాయి. దీనివల్ల యాపిల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu