నోరు తెరిచిన మ్యాన్ హోల్.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం
posted on Sep 11, 2025 3:19PM

హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యాన్ హోల్ తెరచి ఉండటంతో.. స్కూల్‌కు వెళ్తూ ఓ విద్యార్థిని ఆ మ్యాన్ లో పడిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్‌పురాలో చోటుచేసుకుంది. చిన్నారి మ్యాన్ హోల్ లో పడిపోవడం గమనించిన ఆమె తల్లి వేగంగా స్పందించి బాలికను సకాలంలో బయటకు లాగేసింది.
ఈ ఘటనను గమనించిన స్థానికులు బాలిక పుస్తకాల సంచిని బయటకు తీశారు. మ్యాన్ హోల్ లో పడిన బాలిక క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన చార్మినార్ జెనల్ కమిషనర్ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటన గురించి హైడ్రాకు సమాచారం అందించారు. బాలిక నివాసానికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.